(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
శాశ్వత ఉద్యోగాలు రావాలంటు మాసుo బాబా సమాధి వద్ద నిర్వాసితుల ప్రార్థనలు…
కొల్లాపూర్,అక్టోబర్ 9. ( నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లికార్జున సాగర్).
శ్రీశైలం నీటి (నీలం సంజీవరెడ్డి) ప్రాజెక్టు నిర్మాణం లో భూములు ఇండ్లను ఆస్తులను కోల్పోయిన శ్రీశైల నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు తొందరగా రావాలంటు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని శ్రీశైల నిర్వాసితులు పెంట్లవెల్లి మండలం జట్రపోల్ గ్రామం లోని “మాసం బాబా దర్గా” లో గురువారం రోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం వివిధ గ్రామాల లోని శ్రీశైలం నిర్వాసితులు గురువారం జటపోలు గ్రామం లోని “మాసూం బాబా దర్గా”లో భక్తి, శ్రద్ధలతో మాలిజా ను సమర్పించి, మేక పొట్టేళ్లను బలి ఇచ్చి దర్గా లో కుల మతాల కు అతీతం గా హిందూ, ముస్లిం లు సహా అన్ని వర్గాల నిర్వాసితులు పాల్గొనీ మాసం బాబా కు మొక్కులు చెల్లించు కొంటు, శ్రీశైల నిర్వాసితులకు ఎదురవుతున్న కష్టాలు తొలగి, ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రార్థన లు చేశారు.