*ఎంపీటీసీ,జడ్పీటీసీ, స్థానిక ఎన్నికలలో మతోన్మాద శక్తులను ఓడించడానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి సిపిఐ పోటీ*
*సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య*
నేటి సత్యం చేవెళ్లే. అక్టోబర్ 9
- ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల మండల కౌన్సిల్ సమావేశము స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ ఎంపీటీసీ జడ్పిటిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద శక్తులను ఓడించడానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల పోటీ చేస్తుందని తెలిపారు ఓటర్లు బూర్జువా పార్టీలు ప్రలోభపెట్టే డబ్బులకు ఉచితలకు ఆశపడి ఓట్లు వేయద్దని ప్రజాస్వామ్య బద్దంగా ఓటు హక్కును వినియోగించుకొని ఓట్లు వేయాలని తెలిపారు అదేవిధంగా ఎన్నికలలో నిలబడే నాయకులు సంపాదించుకోవడానికి కాకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని నెరవేర్చడానికి రాజకీయాల్లోకి రావాలి అని హితువు పలికారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్ ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎం సుధాకర్ గౌడ్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు శివ మండల మహిళా సంఘం నాయకురాలు జయమ్మ చంద్రకళ లలిత యాదమ్మ పెంటయ్య సాయిలు పాపయ్య మీనాక్షి యాదమ్మ మల్లేష్ తదితరులు పాల్గొన్నా
రు