*గెరిల్లా పోరాట యోధుడు ఎర్నస్టో చేగువేరా*:
నేటి సత్యం నాగర్ కర్నూల్ అక్టోబర్ 9
ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దేశామోని ఆంజనేయులు
* గెరిల్లా పోరాట యోధుడు, ధైర్యశాలి,మూర్తీభవించిన మానవత్వం వంటి విలువలు కలిగిన మహనీయుడు ఎర్నస్టో చేగువేరా* అని అఖిల భారత యువజన సమాఖ్య *(ఏఐవైఎఫ్) నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దేశామోని ఆంజనేయులు అన్నారు. చేగువేరా 𝟱𝟴వ వర్ధంతిని * నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కామ్రేడ్ సిపిఐ కార్యాలయంలో* చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
* ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దేశామోని ఆంజనేయులు* మాట్లాడుతూ క్యూబాలో జన్మించిన చేగువేరా కేవలం తన దేశానికే కాక అనేక దేశాలలో పర్యటించి పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు అని వారు ఉద్ఘాటించారు. వంద పండ్లను ఒక్కడే దాచుకోవడం క్యాపిటలిజం- ఉన్నదాంట్లో అందరూ పంచుకోవడం కమ్యూనిజం అని చెప్పిన చేగువేరా మాటలు ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతుందని వారు అన్నారు.చేగువేరా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాడని వారు అన్నారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని-మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలి అన్న చేగువేరా మాటలు నేటి ప్రపంచానికి పోరాట పటిమను చూపుతుందని వారు ఉద్ఘాటించారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని… మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలన్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, వారిని విప్లవోద్యమం వైపు మళ్ళించకుండా విప్లవాన్ని విజయవంతం చేయడం అసాధ్యమని చే అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. రైతాంగం, కార్మిక వర్గం అనే రెండు పట్టాలమీద విప్లవమనే రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, తడిమట్టి ముద్ద, మార్క్సిజం మౌళిక భావనలు రెండూ ఒక్కటే అన్నారు. కుమ్మరి కళాకారుని చేతుల్లో ఆ చక్రం మీద మనిషి అవసరం కోసం వివిధ ఆకృతుల్ని రూపొందించినట్లుగా ఆయా సమాజాల భౌతిక పరిస్థితుల్ని బట్టి మార్క్సిజాన్ని అన్వయించుకోవచ్చన్నారు.ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, సైద్ధాంతిక విభేదాలున్నా అంతిమంగా ప్రజల విముక్తే విప్లవకారుడి ధ్యేయం కావాలన్నారు. చేగువేరా తాను జీవితాంతం ఏ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే అతన్ని ఫ్యాషన్ ఐకాన్ గా మార్చేసి,ఆయన పేరు మీద నేటికీ వందల కోట్ల వ్యాపారం చేయడం విషాదకరమన్నారు.
ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్. బండి లక్ష్మీపతి ఏఐటీయూసీ మారేడు శివ శంకర్ శ్రీను వెంకటస్వామి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.