- నేటి సత్యం

*గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు, ఈసారి 1581 మాత్రమే*
మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు కరువు
ప్లీజ్ దరఖాస్తు చేసుకోండి, మద్యం వ్యాపారాన్ని మించినది ఇంకోటి లేదంటూ ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రచారం..అయినా లభించని స్పందన
తెలంగాణలో మద్యం దుకాణాల గడువు ముగుస్తుండడంతో కొత్త టెండర్లకు దరఖాస్తులను పిలిచిన ప్రభుత్వం
గతేడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి రెండు వారాలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా, కేవలం 1581 దరఖాస్తులే రావడంతో ఆశ్చర్యానికి గురవుతున్న ఎక్సైజ్ అధికారులు
ఈ ఏడాది కూడా మద్యం టెండర్ల దరఖాస్తులు భారీగా వస్తాయని, దాదాపు 3వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన ప్రభుత్వం
మద్యం దరఖాస్తు ధరను గత ఏడాది 2 లక్షలు ఉండగా దాదాపు 50 శాతం పెంచి 3 లక్షలు చేయడంతో వ్యాపారులు ఆసక్తి చూపడంలేదని విమర్శలు
దరఖాస్తుల స్వీకరణకు కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉండడంతో, ప్రభుత్వ ఆదాయం అంచనాలు చేరుకోవాలంటే కనీసం రోజుకు 10వేల దరఖాస్తులు రావాలని అధికారుల వెల్లడి
గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా దరఖాస్తులు తగ్గాయని పేర్కొన్న ఎక్సైజ్ శాఖ అధికారులు