Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 October 2025, 9:58 am Editor : Admin

ఆర్టీసీ బస్ చార్జర్ ను తగ్గించాలి సిపిఐ!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*ఆర్టీసీ ఛార్జిలను పెంచడం సరికాదు*.

*సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.*

నేటి సత్యం జగదీరిగుట్ట. అక్టోబర్ 10

 

పెంచిన ఆర్ టి సి ఛార్జిలను తగ్గించాలని కోరుతూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో జగత్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద నిరసన చేపట్టడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారులకు కోట్లాది రూపాయలు ఇస్తూ, కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే ఆర్ టి సి ఛార్జిలను పెంచడం అంటే ప్రభుత్వాలు ఉన్నవాళ్లకు ప్రజల నుండి వసులు చేసి పెట్టుబడిదారులకు పంచడానికే ఉన్నాయని,ఇది తెలుసుకోలేని ప్రజలు బూర్జవా పార్టీలకు ఓట్లు వెయ్యడం ద్వారా ఇలాంటి కష్టాలు వస్తాయని ప్రజలు వాటిని గ్రహించేంత వరకు కమ్యూనిస్టులుగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి పేద ప్రజల పై భారం పడకుండా నిర్ణయాలు తీసుకోవాలని,వెంటనే పెంచిన ఛార్జిలను తగ్గించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.

*ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి హరినాథ్ రావ్,ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్,ప్రజానాట్యమండలి అధ్యక్షులు ప్రవీణ్,సిపిఐ నాయకులు నర్సింహా రెడ్డి, వెంకటేష్,ఇమామ్,చంద్రయ్య,శ్రీనివాస్ చారీ,రాజు,సామెల్, యాదగిరి,నర్సింహ,చంద్రకాంత్,గురప్ప,ఆశప్ప,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.*