(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం అక్టోబర్ 10

హైదరాబాద్ రాజధాని మియాపూర్ చౌరస్తాలో జరిగిన బంద్ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్.
హైదరాబాద్
మియాపూర్ మెయిన్ చౌరస్తాలో బిసి కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన సందర్భంగా శేరిలింగంపల్లి జేఏసీ చైర్మన్ మరియు టిఆర్పి శేర్లింగంపల్లి అధ్యక్షులు రమేష్ గారి ఆధ్వర్యంలో నిరసన బంద్ కార్యక్రమం లో తెలంగాణ బిసి ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ రాష్ట్రవ్యాప్త బంధు కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేసి బంద్ పాటించడం జరిగింది. బిసి బంద్ ధర్నా కార్యక్రమంలో అధ్యక్షులు బి రమేష్ యాదవ్ అడ్వకేట్ మాట్లాడుతూ ముఖ్యంగా 42% కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తప్పక ఇవ్వాల్సిందే హైకోర్టు స్టే ఉన్నందున లోకల్ బాడీ ఎన్నికలు ఆపడం ఆ తర్వాత మేము ఎంతకైనా తెగించి మేము కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన 42 శాతం సాధిస్తాం పోరాటమే మా ఏకైక మార్గం వదిలేది లేదు 56% ఉన్న మాకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి జన గణన జరిగిన తర్వాత జీవో వచ్చింది ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఎందుకు ఆపడం జరుగుతుంది కోట్లు కూడా మాకు బీసీలకు అన్యాయం చేస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం. బిజెపి గానీ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఏ పార్టీ అయినా మద్దతు తెలిపి మాకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేవరకు ఉంటే తప్ప తప్పకుండా మిమ్మల్ని బుద్ధి వచ్చే రకంగా షాక్ ఇస్తాం మీరు కాచుకోండి అని పిలుపునివ్వడం జరిగింది. ఐక్యవేదిక అధ్యక్షులు వీరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్తూ రాజకీయ సామాజిక ఆర్థిక 70 సంవత్సరాల నుండి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడి మేము అధికారమే సాధించుకుంటామని మేమెంతో మాకు ఎంత మా ఓట్లు వేసుకొని తప్పకుండా మేము సాధిస్తామని గంట పతంగా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా బీసీ జనాలు మొత్తం ఏకధాటిగా ఐకమత్యంతో ఏకమై ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరు కూడా జేఏసీగా ఏర్పాటు చేసి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా బీసీలకు ఎస్సీ ఎస్టీ లందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది.
బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అయినా బీసీ రిజర్వేషన్ 42% మేము సాధిస్తాం న్యాయపరంగా కోర్టు ద్వారా అయినా పర్లేదు లేదంటే మేము పోరాడిన మొత్తం తెలంగాణను దిగ్బంధము చేసిన మేము సాధిస్తామని గంటపత్రంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కోర్టు స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ద్వారా అయినా గాని మేము సాధిస్తామని అనుకుంటున్నాం బిజెపి పార్టీ గవర్నర్ సంతకం చేయించడం మరియు పార్లమెంట్లో కూడా అనుకూలంగా బిల్లు పెట్టి చట్టం చేయాలని మేము కోరుతున్నాం ఒకవేళ ఆ రకంగా జరిగేది పక్షంలో అన్ని పార్టీలకు బుద్ధి చెప్తామని కోరడం జరిగింది ముఖ్యంగా ఈ ధర్నా బంద్ కార్యక్రమంలో మియాపూర్ ప్రాంతాల వారు పాల్గొని ప్రజల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భేరి రామచంద్ర యాదవ్ తో పాటు రమేష్ యాదవ్ అధ్యక్షులు ఆర్కే సాయన్న బీ నర్సింగ్ ముదిరాజ్, వికారాబాద్ జిల్లా బిసి సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు శంకర్, కంకల్ బిసి అధ్యక్షులు శ్రీనివాస్, విజయలక్ష్మి బి కృష్ణ, మల్కయ్య బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు తదితరులు అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.