Neti Satyam
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 12:25 pm Editor : Admin

చండ్ర రాజేశ్వరరావు .(CR) పౌండేషన్ 26వ వార్షికోత్సవం!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం కొండాపూర్ అక్టోబర్ 12

‘చండ్ర రాజేశ్వర్ రావు (సి. ఆర్ ) ఫౌండేషన్ ‘వృద్ధాశ్రమం 26వ వార్షికోత్సవం’

 

చలి చీమ రెండు ముక్కలైనా ఆ చీమ కొట్లాడాలనే చూస్తుందని, అలాంటి చిన్న జీవికే అంత చైతన్యం ఉంటుందని, అందుకే శక్తివంతమైన మనిషి తన చుట్టు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే అంశంలో మౌనంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే చండ్ర రాజేశ్వర్ రావు (సి.ఆర్) లాంటి ఎంతో మంది మహానీయులు రచయితలుగా, గాయకులుగా, కథనాలు వివిధ రకాలుగా ప్రజలలో చైతన్యాన్ని నింపేందుకు కృషి చేశారని తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. సమాజంలో అంతరాలు పెరిగిపోతున్నాయని, విచ్చిన్నమవుతున్న కుటుంబ బంధాల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

‘చండ్ర రాజేశ్వర్ రావు (సి. ఆర్ ) ఫౌండేషన్ ‘వృద్ధాశ్రమం 26వ వార్షికోత్సవం’ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా సభాధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక, సి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంఎల్ఏ పల్లా వెంకట రెడ్డి , సి.ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కె.అజయ్ కుమార్, కార్యదర్శి పి.జె. చంద్రశేఖర్ రావు, కోశాధికారి, డైరెక్టర్ వి. చెన్నకేశవ రావు, హెల్త్ సెంటర్ డైరక్టర్ డాక్టర్ రజని, సి.ఆర్.ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా చండ్రరాజేశ్వర్ రావు,మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎంపి సురవరం సుధాకర్ రెడ్డితో పాటు వృద్ధాశ్రమంలో చనిపోయిన పలువురి మృతికి కొద్దిసేపు మౌనం పాటించి నివాళ్లు అర్పించారు. అంతకుముందు చండ్ర రాజేశ్వర్ రావు విగ్రహానికి పూల మాల వేశారు. హోం ఫర్ ఏజ్డ్ (వృద్ధాశ్రమం) డైరక్టర్ వి.చెన్నకేశవ రావు సి.ఆర్ ఫౌండేషన్ గురించి వివరించారు. కాగా వివిధ వైద్యసేవల నిమ్మితం ఇటీవల డాక్టర్ రజనీ అందుకున్న అవార్డును ఆమె సిఆర్ ఫౌండేషన్ కు అంకితం చేశారు.

అనంతరం జస్టిస్ నగేష్ భీమపాక మాట్లాడుతూ సమాజానికిఅనేక రకాలుగా సేవలందిచిన వారు వృద్ధాశ్రమంలో ఉన్నారని, వారంతా నడిచేదేవుళ్ల అని అభివర్ణించారు. చండ్ర రాజేశ్వర్ రావు లాంటి మహానీయులు మరణించారనే పదం చాలా చిన్నదన్నారు. సి ఆర్ రాసుకున్న లేఖను ఆయన పార్ధివదేహం వద్ద పెట్టారని, ఆ లేఖ ఇప్పటికీ తన కళ్ల ముందు కదలాడుతోందని గుర్తుచేసుకున్నారు. కొందరు వివిధ కారణాలతో తమ తల్లిదండ్రులను చుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, ప్రస్తుతం మరి కొందరు లగేజీ( తల్లిదండ్రులు) ఉన్నారా? అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కురుస్తున్న కాసుల వర్షంలో తడిచి నిరుపేదలుగా మారుతున్నారని చెప్పారు. మార్క్ చెప్పినట్టుగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారాయన్నారు. ప్రజా సమస్యలపై పరిష్కారానికి చేపట్టే ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినందుకు గాను తన తండ్రి ప్రతి ఏటా కనీసం పది రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపేవారని జస్టిస్ నగేష్ భీమపాక గుర్తు చేసుకున్నారు. పది ఎకరాల్లో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి,మరింత సేవలను అందించాలని, ఇందుకు తమ వంతు సహాకారం అందిస్తామని ఆయన హమీనిచ్చారు.

సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ చండ్ర రాజేశ్వర్ రావు జీవితం ఎంతో మందిని ప్రభావితం చేసిందన్నారు. ప్రతి సమస్యలను సి.ఆర్ లోతుగా ఆలోచించి, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశారన్నారు. హిందీపైన పట్టులేకపోయినప్పటికీ దక్షిణాధి రాష్ట్రాలవారితో ఆయన హిందీలో మాట్లాడేవారని గుర్తు చేశారు. ఆనాటి తెలంగాణ ఉద్యమ సమయంలో సిఆర్ విద్యార్థులతో మాట్లాడారని చెప్పారు.

 

సి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు: పల్లా వెంకట రెడ్డి

పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ సి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ లాంటి పలు వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. లైబ్రరీ సెంటర్ ఇటీవల మరణించిన సురవరం సుధాకర్ రెడ్డి పేరు పెట్టామని,ఈ లైబ్రరీని డిజటల్ చేశామని తెలిపారు. దీనిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వైద్య సేవలను కూడా అందిస్తున్నామని పల్లా తెలిపారు. వృద్ధాశ్రమం సలహా కమిటీ సభ్యులు టి. రాజేందర్ రావు, తమ్మారెడ్డి తాన్యా కుమారి వేదికపై ఆసీనులైనారు.