నేటి సత్యం

బిసి జెఎసి ‘బంద్ ఫర్ జస్టిస్’ రాష్ట్ర బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు అక్టోబర్ 13
– బంద్ ప్రత్యక్షంగా పాల్గొంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు వెల్లడి
నేటి సత్యం హైదరాబాద్. అక్టోబర్ 13
బిసి రిజర్వేషన్ల సాధనకు వివిధ బిసి సంఘాలతో ఏర్పడిన ‘బిసి ఐక్య కార్యాచరణ కమిటీ’-(బిసి జెఎసి) ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని, బంద్ ప్రత్యక్షంగా పాల్గొంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఏంఎల్ఏ కూనంనేని సాంబశివ రావు వెల్లడించారు. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే అన్ని రాజకీయ పార్టీలనూ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కొందరు వంకర వంకరగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన కూడా ఉందని స్పష్టం చేశారు. ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ మద్దతు ఇవ్వాలని కోరుతూ ‘బిసి ఐక్య కార్యాచరణ కమిటీ’-(బిసి జెఎసి) జెఎసి ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య, వర్కింగ్ ఛైర్మన్ జాజుల శ్రీనవాస్ గౌడ్, కో ఛైర్మన్లు రాజారాం యాదవ్, మీడియా కో -ఆర్డినేటర్ గుజ్జకృష్ణ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం పతినిధి బృందం హైదరాబాద్ మఖ్ధూం భవన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు సోమవారం లేఖను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, జాతీయ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, ఎమ్యెల్సీ నెల్లికంటి సత్యం నాయకులు డిజి. సాయిలు గౌడ్, నాగభూషణం, మారగోని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పేద వర్గాలకు కోసం పనిచేయడం, పోరాటం చేయడమే కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతం అని అన్నారు. బొమ్మగాని ధర్మభిక్షం గీత పని వారాల సంఘాన్ని మొట్ట మొదట ఏర్పాటు చేసిన తర్వాత, ఆ పరంపరలోనే వృత్థి సంఘం, డి.హెచ్.పి.ఎస్ తదితర ప్రజా సంఘాలను ఏర్పాటయ్యాయని కూనంనేని గుర్తు చేశారు. వర్గ ప్రయోజనాలను కాపాడుతూనే , కులంలో ఉన్న సామాజిక, సంస్కృతిక వెనుకబాటుతనాన్ని తొలగించేలా పనిచేయాలని, ఆ దిశగా పోరాటం చేయాలని సూచించారు. 10 శాతం ఇడబ్లుఎస్ రిజర్వేషన్ల ప్రవేశపెట్టగానే 50 శాతం ఉన్న రిజర్వేషన్ల పరిమితి తొలగిపోయిందన్నారు. బలహీనవర్గాల హక్కులను కాదనే ధైర్యం ఏ రాజకీయ పార్టీలకూ లేదన్నారు. జీఎస్టీ నుంచి రూ. 26లక్షల కోట్లు వసూలైతే, ఇందులో కేవలం మూడు శాతం మాత్రమే కార్పొరేట్ సంస్థలు చెల్లిస్తున్నాయని, మిగతాది పేద వర్గాల నుంచి వసూలవుతున్నాయని కూనంనేని వివరించారు. ప్రభుత్వ శాఖలలో కూడా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని, ప్రైవేటు సంస్థలలు కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని చెబుతున్నారని, ఆయన మాట్లాడకపోతే బిసి బిల్లును ఆమోదించరా?, రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారికి బిసిల రిజర్వేషన్లపైన బాధ్యత లేదా? అని అన్నారు. ఎవ్వరూ స్పందిచకోతే కేంద్ర ప్రభుత్వమే రిజర్వేషన్లనుఅమలు చేసి, తామే చేశామని చెప్పుకోవచ్చు కదా? అని కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రిజర్వేషన్లు, పేద వర్గాల కోసం కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో దేశంలోనే మొట్టమొదటి సారి జాతీయ పార్టీగా సిపిఐ తెలంగాణకు మద్దతు ప్రకటించిందని, అలాగే బిపి మండల్ కమిషన్ మద్దతు పలకడంతో పాటు ఆ కమిషన్ వ్యతిరేకంగా జరిగిన కమండల్ కు వ్యతిరేకంగా పోరాటం చేశామని కూనంనేసి గుర్తు చేశారు. బిసి హక్కుల సాధన సమితి ఈ నెల 15న చేపట్టనున్న రాస్తారోకోకు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన బిసి జెఎసిని కోరారు.
నెల్లికంటి సత్యం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తరహాలోనే బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఒక సామజిక ఉద్యమంగా చేపట్టాలన్నారు. న్యాయబద్ధమైన రిజర్వేషన్లను గవర్నర్ వ్యవస్థ ద్వారా బిల్లులను ఆపారన్నారు. ఎస్ వర్గీకరణకు కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో మొట్టమొదటిసారి సిపిఐ మద్దతునిస్తున్నట్టు ఆనాటి సురవరం సుధాకర్ రెడ్డి ప్రకటించారని, నిరుద్యోగ, ఉద్యగ, రిజర్వేషన్లు, ఇలా ఎప్పుడూ ఏ ఉద్యమాలు చేపట్టినా సిపిఐ మద్దతుగా నిలబడిందని, ప్రత్యక్షంగా పాల్గొన్నదని గుర్తు చేశారు. ప్రస్తుత బిసి ఉద్యమంలో కూడా కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిసి రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్ట్ కు విరుద్ధంగా రాష్ట్ర హైకోర్ట్ స్టే విధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 9 బలహీనంగా లేదన్నారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి కాలం చెల్లిందని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ వేదికగా కొందరు బిసి రిజర్వేషన్లకు గండి కొడుతున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లను అడ్డుకుంటామని సవాల్ విసురుతున్నారన్నారు. బిసి రిజర్వేషన్ల సాధన కోసం ‘బిసి హక్కుల సాధన సమితి’ ఈనెల 15న తలపెట్టిన రాస్తారోకోకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిసి జెఎసి , నాయకులు కుందారం గణేష్ చారి, వేముల రామకృష్ణ,కులకచర్ల శ్రీనివాస్, నందగోపాల్, కనకాల శ్యామ్ అనంతయ్య, రాములు యాదవ్,చెరుకుల రాజేందర్, శ్రీనివాస్ ముదిరాజ్ ,నీల వెంకటేష్,జాజుల లింగంగౌడ్ , వరి కుప్పల మధు , పానుగంటి విజయ్ గౌడ్ , జూలపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.
,