(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గృహలక్ష్మి పథకం ఎప్పుడు అమలు పరుస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానంచేప్పాలి
బుద్దుల జంగయ్య ప్రశ్న
నేటి సత్యం. జిల్లేడు చౌదరిగుడా న్యూస్
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లేడు చౌదరిగుడా మండల సమితి ఏర్పాటుచేసిన సమావేశానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని అందులో గృహ లక్ష్మీ పథకం కూడా ఉందని తెల్ల రేషన్ కార్డు ఉన్న ఇంటి మహిళ యజమానికి ప్రతి నెల ఇంటి ఖర్చులకోసం 2500 ఇస్తామని హామీ ఇచ్చి మర్చారని ఆయన మండిపడ్డారు ఓడ ఎక్కినంక ఓడ మల్లయ్య ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనే చాందస్తంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతుందని ఆయన విమర్శించారు సాధ్యం కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని దుయబట్టారు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న పథకాలలో మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క హామీ సక్రమంగా అమలు పోవడం లేదని విమర్శించారు గృహ జ్యోతి పథకం కింద రెండు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరంట్ అన్నారు కానీ చాలామంది పేదలకు ఆ పథకం సక్రమంగా అమలుకావడం లేదని ఇందిరమ్మ ఇండ్ల పేరు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలకే ప్రొసీడింగులు ఇచ్చి పరుస్తున్న పరిస్థితి ఉందన్నారు రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయం 15000 ఇస్తామని 12,000 కి కుదించారు మండిపడ్డారు ఇకనైనా ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు పరచాలన్నారు గృహలక్ష్మి పథకం కింద ఇస్తామన్న 2500 వెంటనే లబ్ధిదారుల అకౌంటు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేనియెడల కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై వచ్చే ఆదివారం 19వ తేదీన పార్టీ మండల విస్తృత కౌన్సిల్ సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి పిలుపునివ్వబోతున్నామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ
జిల్లేడు చౌదర్ గూడా మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ మండల సహాయ కార్యదర్శులు కాలపురం బాలరాజ్ ఎండి షబ్బీర్ మండల కార్యవర్గ సభ్యులు వీరేశం లింగమయ్య తదితరులు పాల్గొన్నా
రు