Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogబీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి

నేటి సత్యం 

*బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి*

*కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం పైన పోరాటం నిర్వహించాలి*

*తెలంగాణ మున్సిపల్ సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి*

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని జీవో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది.కొందరు హైకోర్టుకు వెళ్లడంతో స్టే విధించడం జరిగింది. రాజ్యాధికారం లోనికి రావాలని కోరు కుంటున్నాను. నాకు ఉన్న అవగాహన ఈ విధంగా ఉన్నది.ఈ దేశంలో మొత్తం మార్పు వస్తుందని బీసీలలో మౌలిక మార్పులు వస్తావని అనుకోను. మౌలిక మార్పు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపద, వ్యవసాయ భూములు వారి చేతిలోకి రావాలి అది సాధ్యం కాదు.

భారతదేశo లో 52% నుండి 60 శాతం వరకు ఉంటారనే నాకు ఒక అంచనా బీసీల జనగణన జరగాలి అప్పుడు బీసీల జనాభా తేలుతుంది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ఈ యొక్క బీసీల కులగనన జరపడం లేదు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బీసీలకు 42 శాతం అమలు చేయాలని అన్ని పార్టీలు ఒప్పుకోవడం జరిగింది. ఏ ఒక్క పార్టీ కూడా ఇలా చట్టం చేస్తే సాధ్యం కాదు అని కూడా చెప్పలేదు. ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఇలా చేస్తే కోర్టులు కొట్టు వేస్తాయని చెప్పలేదు. అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఒక చట్టం చేసి గవర్నర్ కు పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన చట్టాన్ని సంతకం చేయకుండా రాష్ట్ర గవర్నర్ పక్కన పెట్టారు. ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం జీవో మరియు ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్లడం జరిగింది. ఈ యొక్క విషయం పై కొందరు వ్యక్తుల హైకోర్టులో కేసు వేయడంతో హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికలు ఆగిపోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి గారు 1966లో ఒక ఐఏఎస్ అనంతరామన్ ఆఫీసర్ గారిని బీసీల మీద స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ వేశారు.అనంతరామన్ కమిషన్ అధ్యయనం చేసి బీసీలు చాలా వెనకబడి ఉన్నారని ప్రధాన జన స్రవంతిలోకి రావాలంటే బీసీలకు రిజర్వేషన్లు 25% ఇవ్వాలని నివేదిక ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1970 సంవత్సరంలో 25 శాతం ఇస్తామని ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానిమీద కొందరు వ్యక్తులు 1971లో హైకోర్టుకు వెళ్లడంతో దాన్ని కోర్టులో కొట్టివేయడం జరిగింది. దాని తర్వాత అధికారంలో ఉన్నటువంటి పార్టీ 1981లో మురళీధర్ రావు కమిషన్ వేశారు మళ్లీ బీసీల మీదనే అధ్యయనం చేయడానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే బీసీలను చైతన్యపరిచి ఎన్టీ రామారావు అధికారంలోకి రావడం జరిగింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత 1986లో 25 శాతం ఉన్నటువంటి బీసీల శాతం 44 శాతానికి పెంచుతూ ఒక జీవో తీసుకు రావడం జరిగింది. రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా అప్పుడు పెద్ద ఉద్యమం జరిగి రోడ్లమీదకి వచ్చి ఆందోళన, పోరాటాలు నిర్వహించడం జరిగింది. కొందరు వ్యక్తులు ఎన్టీ రామారావు తీసుకువచ్చిన జీవో మీద హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆ యొక్క జీవో ను కొట్టి వేసింది. హైకోర్టు రెండు కారణాలు చెప్పింది ఎందుకు కోర్టులో కొట్టి వేశామో తెలుసా అని ప్రశ్నించడం జరిగింది. బీసీలు ఒకసారి 25% మరోసారి 44% అంటున్నారు.మీకు బీసీల శాతం ఎంత ఉందో మీకు తెలుసా అని అడగడం జరిగింది.

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 50 శాతం కంటే రిజర్వేషన్లు మించకూడదు అని తీర్పులు ఉన్నాయి కనుక మీరు 50 శాతం మించి పనులు మీరు చేయకూడదని చెప్పింది. ఇదే కారణంతో ఇప్పుడు 42 శాతం ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే విధించడం జరిగింది.

భారతదేశంలో ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్లు లేవా అంటే ఉన్నవి తమిళనాడు రాష్ట్రంలో. భారతదేశoలో 1950 లో రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తర్వాత ఆనాడు ఎస్సీ,ఎస్టీలకు అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేసి రిజర్వేషన్లు రాజ్యాంగ ప్రకారం జనగణన ఉన్నందున అమలు చేశారు.బీసీలకు రిజర్వేషన్లు లేవు బీసీలు ఎప్పుడైనా ఆందోళన పోరాటాలు చేసి ముందుకు వచ్చి కోరుకుంటే అప్పుడు రాజ్యాంగం లో అంబేద్కర్ ఏమి చేశాడంటే ఒక ప్రయత్నం చేశాడు. అది ఏంటంటే ఆర్టికల్ 46 లో బలహీన వర్గాలు అని ఒక ప్రయోగం చేశాడు.ఆర్టికల్ 340, 341 ప్రకారం ఆయా రాష్ట్రాలలో ఒక కమిషన్ వేసి ఆ రిపోర్టు ప్రకారం బీసీల రిజర్వేషన్లు ఇవ్వవచ్చు అని ఒక ఆధారం ఉంది. దాని ఆధారం చేసుకుని తమిళనాడులో పెరియర్ రామస్వామి బలమైన నాయకుడు కావడంతో ఆ రాష్ట్రంలోనే ఉన్న బడుగు బలహీన వర్గాలకి రాజకీయ,విద్య,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కావాలని పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి నెహ్రూ ఆ రాష్ట్రంలోనీ జరుగుతున్న పోరాటం గురించి ఆలోచన చేసి అప్పుడు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి తమిళనాడు రాష్ట్రానికి రిజర్వేషన్లు అమలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. *భారత రాజ్యాంగం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి సారి రిజర్వేషన్ల తమిళనాడులో రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత రిజర్వేషన్లు 69 శాతానికి పెంచడం జరిగింది*. తెలంగాణలో బీసీలకు ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే భారత రాజ్యాంగ బద్దంగా సవరణ జరగాలి. పార్లమెంట్ లో ఎంపీలు చర్చ చేసి మెజార్టీ సభ్యులు రిజర్వేషన్లు మీద ఆమోదం పొంది రాజ్యాంగ భద్రత ఉండాలి అప్పుడే రిజర్వేషన్లు అమలవుతాయి. భారతదేశం లోనీ ఒక తమిళనాడు రాష్ట్రంలో 69 శాతం మించి ఇచ్చినారనీ దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఉండాలనీ ఒక పెద్ద చర్చ జరిగింది. అప్పుడు ఉన్న అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కాక కాలేకర్ కమిషన్ వేయడం జరిగింది. కాకా కాలేకర్ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం చెత్త బుట్టలో వేశారు తరువాత అధికారం కోల్పోవడం జరిగింది. జనతా ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కాకా కాలేకర్ ఇచ్చిన కమిషన్ రిపోర్టును బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది.1978 సంవత్సరంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాకా కమిషన్ ఇచ్చిన రిజర్వేషన్ రిపోర్టును పక్కకు పెట్టి. మరొక బీపీ మండల్ కమిషన్ వేయడం జరిగింది. తరువాత జనతా ప్రభుత్వం అధికారం కూడా కూలిపోవడం జరిగింది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం జరిగింది. బీసీల మీద మళ్లీ కమిషన్ వేసి బుట్ట దాఖల్ చేయడం జరిగింది.1991 ఆగస్టు 7వ తేదీన వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. నేను బీపీ మండల్ కమిషన్ అమలు చేస్తున్న అని చెప్పి, రాజకీయ, విద్య , ఉద్యోగ రంగాల్లో 27 శాతం అమలు చేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్లు 50% కన్నా ఎక్కువ మించలేదు అని ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చట్ట ప్రకారం ఆర్డినెస్ ప్రకారం రిజర్వేషన్లు అమలు కావు కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చి రాజ్యాంగ సవరణ చేస్తేనే బీసీలకు రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఈ యొక్క అంశాన్ని దేశంలోని అన్ని బీసీ వర్గాలు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి నాయకులు ఒక విధంగా ఉంటే దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుంది. బీసీల మీద కపట ప్రేమ ఉపయోగిస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments