Neti Satyam
Newspaper Banner
Date of Publish : 18 October 2025, 11:23 am Editor : Admin

కేంద్ర రాష్ట్ర పార్టీల ద్వంద వైఖరి విడనాడాలి ఎం సి పి ఐ ( యు)




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*బీసీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర పార్టీల ద్వంద వైఖరి విడనాడాలి*

 

*బీసీ బందుకు బిజెపి మద్దతు సిగ్గుచేటు*

 

*బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి*

 

*యం సి పి ఐ (యు)పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ సందర్భంగా మియాపూర్ బస్సుడిపో ముందు నిరసన*

 

నేటి సత్యం శేరిలింగంపల్లి అక్టోబర్ 18

 

బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ బీసీలను అణచి వేస్తూ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పాలక పార్టీలు తమ ద్వంద విధానాలను విడనాడాలని ఎం సి పి ఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ రమేష్, డిమాండ్ చేశారు.

ఈరోజు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణ ఆధిపత్య పాలక పార్టీల వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని కోరుతూ చేపట్టిన రాష్ట్ర బందులో భాగంగా మియాపూర్ బస్సు డిపో ముందు ఎం సి పి ఐ (యు), పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బంద్ పాల్గొన్న యం సి పి ఐ( యు)నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రంలోని బిజెపి బీసీల బందుకు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉన్నప్పటికీ కేవలం 42 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వటానికి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్, జీవో నెంబర్ 9 లు తీసుకువచ్చి చట్ట పరిధిలో అమలు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నదని ఇలాంటి పరిస్థితుల్లో బీసీ ప్రజలు పాలక పార్టీల ద్వంద విధానాలను గమనించి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన బందును జయప్రదం చేసిన అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీలపై వివక్షతను విడనాడి తక్షణమే పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణ అగ్రకుల ఆధిపత్య పార్టీలకు పాలకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా బిసి ఓటర్లు ప్రజలు చైతన్యవంతం కావాలని మేము ఎంతో మాకు అంత వాటా కావాలని నినదిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యం సిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు వి తుకారాం నాయక్, పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్ నాయక్, సభ్యులు బి నారాయణ, మియాపూర్ డివిజన్ నాయకులు దేవనూరి నర్సింహా, యం రాజు తదితరులు పాల్గొన్నారు.