(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం చందానగర్
అక్టోబర్ 18
ఇంటి తాళాలు పగలగొట్టి ఇండ్లల్లో దొంగతనాలు మరియు బైకు దొంగతనాలు చేస్తున్న ఘారానా నేరస్తుడిని పట్టుకొని కేసులను చేదించిన చందానగర్ పోలీసులు..
ఇంటి తాళాలు పగులగొట్టి వరుసగా ఇండ్లలో దొంగతనాలు మరియు బైకు దొంగతనాలు చేస్తున్న జిన్నారం గ్రామం, మరికల్ మండలం, నారాయణ్ పేట్ జిల్లాకు చెందిన అలవాటు పడిన ఘరానా నేరస్తుడు అయిన *ముద్దంగి భీమేష్* ను తేదీ 18.10.2025 నాడు చందానగర్ పోలీసువారు పట్టుకొని తమదైన శైలిలో విచారించగా చందానగర్ ps పరిధి యందు ఒక ఇంటి దొంగతనం మరియు (02) మోటార్ సైకిళ్ళు, దుండిగల్ ps పరిధిలో ఒక ఇంటి దొంగతనం, మక్తల్ ps పరిధిలో ఒకే రోజు (02) ఇంటి దొంగతనాలు, చైతన్యపురి ps పరిధిలో ఒక ఇంటి దొంగతనం మరియు హయాత్ నగర్ ps పరిధిలో ఒక మోటార్ సైకిల్ ను దొంగతనం *(మొత్తం (08) దొంగతనాలు)* చేసినట్లు అంగీకరించినాడు. నేరస్తుడి నుండి ప్రస్తుతం (02) మోటార్ సైకిళ్ళు, బంగారు (08గ్రాములు), వెండి ఆభరణాలు(200 గ్రాములు), స్వాధీనపరుచుకొని నిందితుడిని రిమాండుకు తరలించటం జరిగినది.
*ఇతను ఇంతకుముందు మొత్తం (42) కు పైగా కేసులలో జైలుకు పోయినాడు.*
ఇట్టి నేరస్తుడిని పట్టుకున్న చందానగర్ క్రైమ్ సిబ్బందిని మాదాపూర్ డీసీపీ మరియు మియాపూర్ ఏసీపీ లు అభినందించినారు