Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogదీపావళి శుభాకాంక్షలతో...

దీపావళి శుభాకాంక్షలతో…

నేటి సత్యం

20-10-25

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 

*నరక చతుర్దశి దీపావళి పండుగ*

 

*ధనలక్ష్మి పూజ*

*దీపావళి*

➖➖➖✍️

 

 

*’నరకలోక విముక్తి కలిగించే ‘నరక చతుర్దశి’:*

“`

నరాకాసురవధ దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం, దీపదానం, యమ తర్పణం వల్ల నరకబాధలు ఉండవంటారు.

 

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే ‘నరక చతుర్దశి’ అంటాము. “`

 

*నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి.*“`

మన పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి.

మన సంప్రదాయ పండుగల్లో ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా జరుపుకోవడమే నరక చతుర్దశి విశిష్టత.

పండుగలకు, ఖగోళ సంఘటనలకు సంబంధం కూడా ఉంది, నరకాసుర వధ – చతుర్దశి నాడు (ఆశ్వయుజ బహుళం) ఆకాశంలో రాశులస్థితిని సూచించేది.

తుల రాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంది.

 

నరకుడు భూదేవి కుమారుడు, మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి.

కాబట్టి అతడి పాలన అంధకారమయం.

ఆ రోజునే మేష రాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది, అది అస్తమించే వరకు చీకటే..

 

మేష రాశి అస్తమించే వేళకు తుల రాశి తూర్పు దిక్కున వస్తుంది, స్వాతి నక్షత్రానికి అధిష్ఠాన దేవత వాయువు.

దాన్ని అధిష్ఠించి నరకునిపైకి కృష్ణుడు, సూర్యుడు, సత్యభామ, చంద్రుడు బయలుదేరారు.

నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయాల్లో కన్య రాశి (కన్యల గుంపు) నరకుని బంధాల నుంచి విడివడి, తమకు విముక్తి కలిగించిన సూర్యుడు – కృష్ణుణ్ని నాయకునిగా చేసుకుంది. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు.

 

నరక భావాలు అంటే దుర్భావాలను కృష్ణభక్తి అనే చక్రాయుధంతో

ఖండింపజేసి జీవుడు భగవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్ధం.

నరాకాసురవధ స్త్రీ స్వాతంత్రానికి నిదర్శనం.

 

దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం, దీపదానం, యమ తర్పణం వల్ల నరకబాధలు ఉండవంటారు.

 

నరక చతుర్దశిని ‘ప్రేత చతుర్దశి’అనే పేరుతోనూ పిలుస్తారు, ఈనాడు నరక ముక్తి కోసం యమ ధర్మరాజును ఉద్దేశించి దీప దానం చేయాలని ‘వ్రత చూడామణి’ చెబుతోంది.

యముడికి ఎంతో ప్రీతికరమై చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి.

ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మీ, మంచినీటిలో గంగాదేవి కొలువుంటారని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

 

యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు.

 

అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది.

యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు.

నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశి యని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి.“`

 

*‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ , తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’* “`

చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

 

ప్రతీమాసంలోనూ బహుళ చతుర్దశి మాస శివరాత్రి.

ఆ రోజు లేదా మర్నాడు తెల్లవార్లకుండా అభ్యంగన స్నానం చేయరాదనే నిషేధం ఉంది, అయితే ఆశ్వయుజ బహుళ చతుర్దశికి అమావాస్య లేదు.

పైగా ఈ రోజున అభ్యంగన స్నానం విధిగా చేయాలని ‘వ్రత చూడామణి’ స్పష్టం చేస్తుంది.

స్నానం చేస్తుండగా తలచుట్టూ దీపం తిప్పడం, టపాసులు కాల్చడం ముఖ్య ఆచారం.

నరకాసురుడు తన వధకు ముందు శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడని తెలుసుకున్న నరకాసురుడు పరమాత్ముని క్షమాభిక్ష కోరాడు, అందకు పరంధాముడు మన్నించి, నరకుడు చనిపోయిన దినం నాడు స్నానం చేసే వారికీ పాప విముక్తి కలుగుతుందని వరం ప్రసాదించాడు✍️“`

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🌷🙏🌷“`

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏“`

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

➖▪️➖

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments