(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం 
*ఐఎన్‌ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు నిద్రపట్టదు: మోదీ*
* గోవా: ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ ప్రేరణతో మన నావికాదళం ముందుకెళ్తోందని కొనియాడారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్ పేరు వింటే చాలు.. శత్రువులకు నిద్రపట్టదన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని సెల్యూట్ చేశారు.