(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
నీవు మరణిస్తేనే మంచోడివి.. బతికుంటే ఉద్యమద్రోహివి.. నేటి సమాజం..
నక్సలైట్ గా పోలీసు తుటాలకు ఒరిగితేనే..మరణిస్తేనే వీరుడు.. అమరుడు..
లేకపోతే విప్లవ ద్రోహి..
ఒక నవ్వు పట్ల ఆయన 40 ఏండ్ల చరిత్రను అవమానిస్తున్నారు.. అనుమానిస్తున్నారు..
ఆయనపై కామేంట్లు చేసేవాడు.. విమర్శించేవారంత.. ఏసి గదుల్లో జీవితం గడుపుతున్నవారే.. విలాసా జీవితాలు అనుభవిస్తున్నవారే..
ప్రజల కోసం నాటి కాలంలో తుఫాకి పట్టి.. అడవి బాట పట్టిన అన్నలు మరణిస్తేనే మంచివారు.. పరిస్థితులకు అనుగుణంగా.. రాజ్యంపై ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవలేము అని.. తనతో పాటు తనకు రక్షణగా ఉన్న ప్రాణాలను కూడా కాపాడుకోని.. ప్రజాస్వామ్యబద్దంగా.. రాజ్యంగబద్దంగా ప్రజల్లో మార్పు తీసుకువద్దాం అనుకోవడం కూడా నేరమేనా.. ఉద్యమ ద్రోహులుగా చిత్రికరిస్తారా..?
మోసేవాడికి తెలుసు కావటి బరువు అన్నట్లు.. నక్సల్ బరిలో 40 ఏళ్లు ఉండి.. పీడిత తాడిత ప్రజల కోసం పోరాటం చేసిన వారికి తెలుస్తుంది ఒడిదొడుకులు..
గడిచిన ఆరు నెలల్లో అడవుల్లో పోలీసు తుటాలకు వందల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే.. ప్రశ్నించలేని వారు.. లొంగిపోయిన వారిని తప్పుపడుతూ .. మీరు లొంగిపోవద్దు.. పోలీసు తుటాలకు బలి కావాలి.. చావాలి.. అప్పుడే మీరు వీరులు అంటున్నారు.
నన్ను అడిగితే.. ఇప్పుడు తుఫాకి గొట్టాలతో సాధించేది ఏం లేదు.. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది.. ఇంకా రావాలి..
అడవుల్లో ఉన్న అన్నలు.. జన జీవన శ్రవంతిలో కలిసి.. ఓటు అనే ఆయుధాన్ని.. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆయుధాలుగా మార్చాలి. రాజకీయాల్లోకి రావాలి.. రాజ్యాధికారం దిశగా ప్రయత్నించి.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి.
చంపడాలు, చవడాలు ఎప్పటికైన మానవ హక్కుల ఉల్లంఘనే..
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి.. వారి లొంగుబాట్లకు ఏర్పాట్లు చేయాలి.. పునరావాసం కల్పించి.. వారికి ఉపాధీ అవకాశాలి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది.
మరో నక్సల్స్ ఉద్యమం పుట్టవద్దంటే.. పాలకుల పాలన నీతి నిజాయితిలతో కొనసాగాలి.. పర్యవరణ పరిరక్షణ కోణంలో పాలకుల ఆలోచనలు ఉండాలి.
# నేటి సత్యం