Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 9:16 am Editor : Admin

ఇళ్లస్థలా మంజూరు కై ఉద్యమిద్దరం !!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇండ్ల స్థలాల మంజూరు

కొరకు మరోసారి ఉద్యమిద్దాం..

కొల్లాపూర్, అక్టోబర్ 21, (నేటి సత్యం ప్రతినిధి:యస్.పి. మల్లికార్జున సాగర్).

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గము లోని జర్నలిస్టులకు ప్రభుత్వ పరం గా ఇళ్ల స్థలాలు,ఇండ్ల ను మంజూరు కొరకు ప్రభుత్వం పై మరోసారి ఒత్తిడి తీసుకొచ్చేందుకు జర్నలిస్టులంతా మరోసారి ఉద్యమిద్దామని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కొల్లాపూర్ తాలూకా కార్యవర్గ సమావేశం కొల్లాపూర్ పట్టణం లోని సంఘ భవనం లో సోమవారం రోజు కొల్లాపూర్ సంఘ ఆధ్యక్షులు జలకం మద్దిలేటి ఆధ్వర్యం లో జరిగినది.

సమావేశానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన టి డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ మాట్లాడుతూ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని జర్నలిస్టులందరికి ప్రభుత్వ పరం గా ఇళ్ల స్థలాలు, పక్కా గృహ నిర్మాణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గతం లో టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యం లో కొల్లాపూర్ లో నెల రోజుల పాటు కొల్లాపూర్ జర్నలిస్టులు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు అటు ప్రభుత్వం లోనూ, ఇటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులలో కదలికలు తీసుకు వచ్చాయని కొల్లాపూర్ లో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను స్ఫూర్తిగా తీసుకొని మిగతా జర్నలిస్టు సంఘాలు వివిధ ప్రాంతాలలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేయాలని ఉద్యమాలు చేపట్టినవి అని ఆయన అన్నారు.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో జర్నలిస్టులు టి డబ్ల్యూ జే ఎఫ్ ఆధ్వర్యం లో ఇళ్ల స్థలాలు, పక్కా గృహ నిర్మాణాలను మంజూరు చేయాలని చేసిన రిలే నిరాహార దీక్షలకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సాను కూలం గా స్పందించారని గత ఎన్నో ఏండ్లుగా జర్నలిస్టులు ప్రభుత్వాలు అలాగే ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యాలకు గురవుతూ వచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లో ఏర్పడిన తరువాత ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాను కూలం గా ఉన్నారని ఇండ్ల స్థలాలు ఇండ్లు, అలాగే అక్రి డేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేసే విధి విధానాలను రూపొందించుకునేందుకు జర్నలిస్టు సంఘాల నాయకులందరూ కలిసి రావాలని ఆహ్వానించడం హర్షించదగ్గ విషయమని తాటికొండ కృష్ణ అన్నారు.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేయాలని గతం లో కొల్లాపూర్ లో టీ డబ్ల్యూజేఎఫ్ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలను స్ఫూర్తి గా తీసుకొని త్వరలో మరొక కార్యాచరణ కార్యక్రమం ను రూపొందించుకుని ఇల్లు ఇళ్ల స్థలాల మంజూరి కొరకు జర్నలిస్టులంతా కలిసికట్టుగా ఉద్యమించాలని అందుకు సిద్ధం గా ఉండాలని ఆయన జర్నలిస్టులకు సంఘ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

సమావేశం లో నాగర్ కర్నూల్ జిల్లా టీ డబ్ల్యూ జే ఎఫ్ మహాసభలను కొల్లాపూర్ లో నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది .

రాష్ట్ర ప్రభుత్వం త్వర గా జర్నలిస్టులకు నూతనం గా అక్రిడేషన్ కార్డులు, రైల్వే పాసులు పునరుద్ధరణ (కేంద్ర ప్రభుత్వ అధీనం లో,) సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులందరికీ కార్పొరేట్ వైద్యశాలలో కూడా వైద్య సహాయం అందించే విధం గా ఆరోగ్య వైద్య సదుపాయాలను కల్పించాలని జనరల్ బాడీ లో తీర్మానం చేస్తూ ప్రభుత్వాన్ని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.

టీ డబ్ల్యూ జే ఎఫ్ సభ్యత్వాలను సభ్యులకు రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ , నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు రామచందర్ లు అందించారు. సంఘ సభ్యులంతా సభ్యత్వాలు స్వీకరించాలని తీర్మానించడం జరిగింది.

ఈ సమావేశం లో టి డబ్ల్యూ జె ఎఫ్

రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు చక్కెర రామచంద్రమ్ ,ఉపాధ్యక్షులు యస్. పి.మల్లిఖార్జున సాగర్, తాలూకా అధ్యక్ష కార్యదర్శులు జలకము మద్దిలేటి, కురుమయ్య, స్వాములు కారంగి గోవింద్, భాను ప్రకాష్, సి.పి.నాయుడు,సురేందర్, రజనీ బాబు, గోపాసి కేశవులు, చిన్న కురమయ్య, తదితరులు పాల్గొన్నారు.