(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మహబూబాబాద్ జిల్లా 
*నర్సింహులపేట మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు
నేటి సత్యం అక్టోబర్ 21 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్య
ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ1959 అక్టోబర్ 21న లడక్ ప్రాంతంలో చైనా సైన్యం దాడిలో వీరమరణం పొందిన 10 మంది జవాన్లు స్మారక అర్థం గా ప్రతి సంవత్సరం ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం గా జరుపుకుంటామని తెలిపారు పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని ఎలాంటి పరిస్థితుల్లో నైనా ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ ముందుంటుందని పేర్కొన్నారు జిల్లా పోలీస్ సైబర్ నేరాలు గంజాయి నిర్మూలనలో అప్రమత్తంగా ఉన్నారని అక్టోబర్ 21 నుండి 31 వరకు ప్రజలకు చేరువయ్యే ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు *DSFI రాష్ట్ర నాయకులు ఎర్ర దిలీప్ కుమార్*, KVPS, MRPS వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు…