Neti Satyam
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 6:39 am Editor : Admin

అమరుడు ఎల్లంపల్లి ప్రమోద్ కుమార్ కు పోలీసు శాఖ తరపున ఘన నివాళి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 22 : కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్, అమరుడు ఎంపల్లి ప్రమోద్ కుమార్ కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు. తెలంగాణ లో లా అండ్ ఆర్డర్ ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్దతతో ఉంది.ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తాం.

భర్త ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటాము.

GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు, అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటాం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున నా నివాళి.

-బీ.శివధర్ రెడ్డి-డీజీపీ, తెలంగాణ