మనువాదంతో దేశఐక్యతకు విఘాతం
ఘనంగా డి హెచ్ పి ఎస్ 19వ వ ఆవిర్భావ వేడుకలు.పి
డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అనిల్ కుమార్
నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 22
హిమాయత్ నగర్ : దేశంలో వేళ ఏళ్లుగా కొనసాగుతున్న కుల ఆర్థిక సమానతలను అంతం చేయడమే డి హెచ్ పి ఎస్ లక్ష్యంగా కృషి చేయాలని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపా క అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. బుధ వారం రాజు బహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రం హిమాయత్ నగర్ రాష్ట్ర కార్యాలయం వద్ద డి హెచ్ పి ఎస్ 19వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా డి హెచ్ పి ఎస్ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక అసమానతలు కులం రూపంలో ఈ దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని వీటివల్ల దేశం పూర్తిస్థాయిలో వెనుకబడిపోయి సాటి మనిషిని మనిషిగా చూడని నీచత్వం ఉందన్నారు 78 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా నేటికీ గుడి బడిలో నేటికీవివక్ష కొనసాగడం దేశ ప్రజల ఐక్యతకు దేశ అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందన్నారు. కుల వ్యవస్థను అసమానతలు సమర్ధించే పాలకులు అధికారంలో ఉండటం వల్ల రాజ్యమే ఈ అసమానతలకు అండగా నిలబడటం వల్ల వాటిని రూపుమాపడానికి తరతరాలు పడుతుందన్నారు. కుల వ్యవస్థ మూలాలు భూస్వామ్య మనువాద వ్యవస్థలలో ముడిపడి ఉన్నాయని చెప్పారు.మనువాదమే మన దేశాన్ని శాసిస్తుందని దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం లో అందరూ ఐక్యంగా ముందుకు సాగితేనే దేశం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందన్నారు.శాస్త్ర సాంకేతిక రంగం ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంటే మరోవైపున సాటి మనిషిని నీచంగా చూడటం అంటే మనువాద ప్రభావం ఏమిటో విధితమవుతుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా మనువాదం సృష్టించిన అసమానతల్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు . గత ఐదేళ్ల కాలంలో6.34.486 దౌర్జన్యాలు జరిగినట్లు ఎన్సీర్బీ నివేదిక పేర్కొంటుందన్నారు అందులో సగానికంటే ఎక్కువ బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ లో 3లక్షల దౌర్జన్యాలు జరిగాయన్నారు. వీటిని అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమ వెల్లువలో ఏర్పడిన ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు మన రాజ్యాంగం స్థానంలో తిరిగి మనుస్మృతిని ప్రవేశపెట్టడానికి ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోని బిజెపి కృషి చేస్తుందన్నారు దీనివల్ల దేశం మళ్లీ మధ్యయుగాల కాలంలోకి ప్రయాణిస్తుందన్నారు తిరిగి చాతుర్వర్న వ్యవస్థ రూపుదిద్దుకుంటుందన్నారు ఈ దేశంలో కష్టజీవులు ఐక్యత కోసం కులం మత అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు మరింత విస్తృతంగా జరగాలన్నారు.కులవివక్ష అంటరానితనం యూనివర్సిటీ స్థాయిలో కూడా నేటికీ కొనసాగుతుందన్నారు.దళితులకు దేవాలయాల ప్రవేశాలులేవన్నారు .ఈ కార్యక్రమంలో డి హెచ్ పి ఎస్ హైదరాబద్ జిల్లా అధ్యక్షులు ఏ రాజు కుమార్, జిల్లా కార్యదర్శి జేరుపోతుల కుమార్, నాయకులు బండి నరసింహ, బూడిద కుమార్, బోడ అంజయ్య, అంజి, నరసింహ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.