(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎ
స్సీ ,ఎస్టీ, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలి
-బిఆర్ఎస్వి జిల్లా నాయకులు డి శేఖర్, నేటిసత్యం/ కొల్లాపూర్.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కీము సంబంధించిన నిధులు 180 కోట్ల రూపాయలను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వం బకాయిలు చెల్లించేంతవరకు పాఠశాలల్లోకి పిల్లలను రానివ్వమని అక్టోబర్ 6 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగాయి. దీనితో గత వారం రోజులుగా పాఠశాలలకు వెళ్లలేక 30 వేల మంది దళిత, గిరిజన పిల్లలు రోడ్డున పడ్డారని,రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి 180 కోట్ల రూపాయలను విడుదల చేయాలని డి శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేందుకు గత 25 క్రితం బెస్ట్ అవైలబుట్ స్కీంను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ నిధులు పెండింగ్ పెట్టడం వల్లే ఏదైతే అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యం నేరవేరకపోగా ఈ స్కీం ఎత్తివేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ స్కీం నిబంధనల ప్రకారం ఆరు నెలలకు ఒక్కసారి బకాయిలు చెల్లింపు చేస్తే ఈ సమస్యలు ఉత్పన్నం కావు. బకాయిలు ఇవ్వాలని విద్యార్ధులను ప్రైవేటు పాఠశాలలు పాఠశాలలోకి అనుమతించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
కావున పేద విద్యార్థులు, ప్రధానంగా సామాజికంగా వెనుకబడిన దళిత, గిరిజన విద్యార్థుల చదువులు మధ్యలో నష్టపోకుండా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.