(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి*
*హయత్ నగర్: అక్టోబర్ 24 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న*
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి డివిజన్ లోని మధురానగర్ కాలనీవాసులతో కలిసి నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు కాలనీలో మిగిలి ఉన్న వీధుల్లో కూడా సిసి రోడ్ల నిర్మాణానికి విజ్ఞప్తి చేయడంతో కార్పొరేటర్ స్పందించి మధురానగర్ కాలనీలో కేవలం ఒకటి రెండు వీధుల్లో తప్ప మిగిలి ఉన్న వీధుల్లో పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం జరిగిందని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం జరుగుతుందని వారు కాలనీవాసులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు అమల్ నాయక్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నరేష్, కృష్ణమూర్తి, యాదగిరి, మహేష్ సూర్య, శంకర్, నిర్మల, రాజు, కిరణ్, రవీందర్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.