బస్సు అగ్ని ప్రమాదం బాధితులకు న్యాయం చేయాలి సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు
కర్నూల్ సమీపంలో చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చిన విషాద ఘటన. ఉదయం ఈ వార్త అందరి హృదయాలను కలచివేసింది. ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల పట్ల నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అవసరమైన వైద్య సహాయం, ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దేవుడు దయతో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, బాధిత కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను