(adsbygoogle = window.adsbygoogle || []).push({});
వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు..
చందానగర్ డివిజన్‌లోని వేమన రెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించిన వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పుజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు..
ఈ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు కార్పోరేటర్ భర్త శ్రీ రఘునాథ్ రెడ్డి గారితో కలిసి హాజరయ్యారు..కాలనీ వాసుల సమష్టి కృషితో కార్యాలయం నిర్మాణం పూర్తయిన సందర్భంగా, అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి నివాసితుల సంక్షేమానికి ఈ నూతన కార్యాలయం కేంద్రంగా పనిచేయాలని ఆకాంక్షించారు..అసోసియేషన్ చేస్తున్న కృషిని అభినందించారు..
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి కార్యవర్గ సభ్యులు, కాలనీ పెద్దలు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు..