(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ ఏకగ్రీవ ఎన్నిక*నేటి సత్యం రంగారెడ్డి అక్టోబర్ 25
*రంగారెడ్డి జి
ల్లా శాఖ అధ్యక్షుడిగా షాద్ నగర్ పట్టణ (ఎస్ టి ఓ) మహేశ్వర్ ఎన్నిక*
*జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు- మహేశ్వర్*
షాద్ నగర్: తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ కు 2025-2028 మూడు సంవత్సరాలకు గాను జరిగిన ఎన్నికల్లో షాద్ నగర్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ రాజమోని మహేశ్వర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను రంగారెడ్డి జిల్లా శాఖకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు తమ బాధ్యతను స్వీకరించి జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉన్నతి కోసం కృషి చేస్తామని సంఘం ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని అన్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్నికల నిర్వహణ అధికారిగా బాలరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అధికారి మాట్లాడుతూ అందరి ఏకాభిప్రాయంతో ఈ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగిందని ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అందరి సభ్యుల ఆమోదంతో రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులుగా రాజమోని మహేశ్వరుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. అలాగే ఇతర సభ్యులను కూడా అందరి ఆమోదంతో ఎన్నుకోవడం జరిగిందని అయితే రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చెట్ల అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు,పద్మ నలిని, పులి లక్ష్మీదేవి, ప్రధాన కార్యదర్శులుగా సాయి మాలిక్, కార్యదర్శులుగా ఘోర రాఘవేందర్ గౌడ్, భరత్, కరుణాకర్ లను ఎన్నుకున్నారు.