(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హోమ్ గార్డు కు నివాళులు అర్పించిన
ఎస్, ఐ లు,పోలీస్ సిబ్బంది…
కొల్లాపూర్, అక్టోబర్ 25 ( నేటి సత్యం ప్రతినిధి: యస్. పి. మల్లికార్జున సాగర్)
విధి నిర్వహణ లో ప్రమాదానికి గురై మరణించిన హోం గార్డు వెంకటస్వామి (35)కి పోలీస్ అధికారు లు, సిబ్బంది నివాళులర్పిస్తూ సెల్యూట్ చేశారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము పెద్ద కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డు గా విధులు నిర్వహిస్తున్న పస్పుల గ్రామ నివాసి వెంకట స్వామి(35) విధి నిర్వహణ లో భాగం గా శుక్రవారం రాత్రి ముష్టి పల్లి గ్రామం వెళ్ళి తిరిగి పెద్ద కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ కు మోటర్ సైకిల్ పై వస్తుండగా ఆదిరాల గ్రామ సమీపం లో బైక్ ప్రమాదం కి గురై స్పాట్ లో అకాల మృతి చెందారు.
కాగా మృతి చెందిన హోమ్ గార్డు వెంకట స్వామి అంత్య క్రియలు ఆయన స్వగ్రామం పసుపుల గ్రామం లో శని వారం కుటుంబ సభ్యులు నిర్వహిస్తుండగా పెద్ద కొత్తపల్లి మండల పోలీస్ ఎస్ఐ సతీష్,కోడేర్ మండల పోలీస్ ఎస్ఐ జగదీష్ లు పోలీస్ సిబ్బంది మృతుడు వెంకట స్వామి మృత దేహం పై పూల మాల లు వేసి సెల్యూట్ చేస్తూ నివాళులు అర్పించి తుది వీడ్కోలు పలికారు.