Neti Satyam
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 1:01 am Editor : Admin

గన్నేరువరం మండల కేంద్రంలో ఏవో కిరణ్మయి ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, ఆగస్టు 25 (రమేష్ రిపోర్టర్):-
గన్నేరువరం మండలంలో బొడ్డు బాలయ్య అనే  వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయ అధికారులు సందర్శించారు.ఈ సందర్భంగా ఏవో కిరణ్మయి మాట్లాడుతూ : ఈరోజు గన్నేరువరం మండలంలో వరి పొలాన్ని విసిట్ చేయడం జరిగింది.  కొత్త వరి  రకం డి.ఆర్. ఆర్. డాన్ 75 అనే వంగడాన్ని  లాస్ట్ సీజన్లో  అత్యధిక దిగుబడి వచ్చింది.అని తెలిపారు. రైతులు ఈ వంగడాన్ని చూసి  వేయడం జరిగింది. మండల కేంద్రంలోని బొడ్డు బాలయ్య అనే రైతు  దగ్గర మాత్రమే ఈ సీడ్ అవైలబుల్ ఉంది. తను 5 ఎకరాలకు సరిపడా విత్తనాన్ని తీసుకొచ్చుకొని సాగు చేస్తున్నారు.కాకపోతే  ఇది హైబ్రిడ్ వంగడం గనుక  గింజ రాలే తత్వం తక్కువగా ఉంటుంది. ఈ వంగడం  అత్యధిక పిలకలు వస్తుంది మనకి ఎనిమిది నుండి 12 పిలకలు మాత్రమే వస్తుంది. కానీ గొలుసు చూస్తే మాత్రం గింజలు 250 నుండి 300 వరకు వస్తాయి అని తెలిపారు. కెవికె సైంటిస్ట్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ : ఈరోజు గన్నవరం గ్రామంలో బొడ్డు బాలయ్య అనే రైతు వరి పొలాన్ని చూసాము ఈ వరి రకాన్ని చూసినట్లయితే ఇది అత్యధిక గింజలుగా ఏర్పడతాయి 250 నుండి 350 వరకు వస్తాయి ఈ వంగడం గింజలు ఎక్కువగా రావడం వల్ల ఈ వంగడానికి తెగుళ్లు, కంకినల్లి అనే బ్యాక్టీరియ వస్తాయి కానీ మనం వాటిని తొందరగా గుర్తించాలి . సరైన సమయంలో పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులను ఏర్పారేయవచ్చు ఈ తెగుళ్లకు బోరాన్, వొమైట్ అనే మందును మార్కెట్లో తెచ్చుకొని పిచికారి చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది అని తెలిపారు.
         బొడ్డు బాలయ్య అనే రైతు మాట్లాడుతూ:ఈ యొక్క వరి రకాన్ని వేయడం ఇది మొదటిసారి చాలా బాగుంది ఇప్పటివరకు నేను రెండు సార్లు మాత్రమే పిచికారి చేశాను అత్యధిక పిలికలుగా వచ్చాయి గింజ శాతం కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇది ఒక్కసారి మనం పొలంలో వేయడం వలన రెండు సంవత్సరాల వరకు ఈ రకం బాగా పనిచేస్తుంది నేను 5 ఎకరాలలో వేసాను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి నా యొక్క వరి పొలాన్ని చూసి పలు సూచనలు చేశారు వారు చెప్పినట్టుగానే నేను చేశాను ఈ యొక్క వరి వంగడం కావాలంటే నాకు తెలపండి నా ఫోన్ నెంబర్ 9573877552 ఈ నెంబర్కు ఫోన్ చేయండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివో కే భాగ్యలక్ష్మి  ఏవో కిరణ్మయి ఏ ఈ ఓ ప్రశాంత్ రైతులు పాల్గొన్నారు.