Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaరైతులకు సేవలు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం! ప్రచారం చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం !

రైతులకు సేవలు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం! ప్రచారం చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం !

రైతులకు సేవలు అందిస్తున్నది కేంద్రం…

సోకులు, ప్రచారం కాంగ్రెస్ పార్టీది….కొల్లాపూర్, అక్టోబర్ 27 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లికార్జున సాగర్).

రైతు అభివృద్ధి సంక్షేమ మే ధ్యేయం గా కేంద్ర ప్రభుత్వం నూనె గింజల ఉత్పత్తిని పెంచుతూ రైతులు ఆర్థికం గా నిలదొక్కు కుంటు పేద ప్రజలందరికీ నూనె ఉత్పత్తులు అందుబాటు లోకి రావాలని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చిత్తశుద్ధి తో కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజ కవర్గం లో అసత్య ప్రచారం లు చేసుకుంటూ దొడ్డిదారి లో రాజకీయ లబ్ధి పొందడానికి నీచాతి నీచం గా పాల్పడు తున్నారని కొల్లాపూర్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేతూరి నారాయణ విమర్శించారు.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని టి డబ్ల్యూ జే ఎఫ్ కార్యాలయం లో విలేకరులతో సోమవారం ఆయన మాట్లాడుతూ ఎన్ ఎం ఈవో—ఓ ఎస్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులు నూనె గింజల ఉత్పత్తిని పెంచుకొని తద్వారా రైతులు అభివృద్ధి చెందుతూ పేద ప్రజలకు వినియోగదారులకు నూనె గింజల ఉత్పత్తులను తక్కువ ధరలకు అందు బాటు లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యము తో రైతులకు నూరు శాతం సబ్సిడీ గా ఉచితం గా వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయడానికి పథకాన్ని ప్రవేశపెట్టి వేరుసెనగ ను ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నదని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితం గా పంపిణీ చేస్తున్న వేరుసెనగ విత్తనాలను తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల అండ దండలతో వేరుశనగ పంపిణీ

అర్హులైన రైతులకు అంద జేయ కుండా బినామీ పేర్లతో అధికార పార్టీ నాయకులకు వారి వర్గాలకు దొడ్డిదారిలో పంపిణీ చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కొల్లాపూర్ శాసనసభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు అండ దండలతో నడుస్తున్న రత్నగిరి ఫౌండేషన్ ద్వారా తాము రైతులకు ఉచితం గా వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ పబ్బ గడుపు కుంటున్నారని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితం గా పంపిణీ చేయడానికి సమకూర్చిన వేరుసనగ విత్తనాలను కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లో వ్యవసాయ అధికారుల తో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు కుమ్మక్కై అర్హులైన రైతులకు వేరుశనగ సాగు చేసుకునే రైతులకు వేరుసెనగ విత్తనాలు మంజూరు చేయకుండా అసలు భూములే లేని వ్యక్తులకు, వేరుశనగను పండించని వ్యక్తులకు వేరుసెనగ విత్తనాలను పెద్ద మొత్తం లో దొడ్డి దారి లో పంపిణీ చేస్తున్నారని ఆయన విమర్శించారు.

వ్యవసాయ అధికారులతో కుమ్మక్కై స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డిదారిన వేరుసెనగ విత్తనాలను అధిక మొత్తం లో పంపిణీ చేయించుకుంటూ అతి వేరుశెనగ విత్తనాలను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు వాస్తవం గా విత్తనాలు కావాల్సిన రైతులకు అధిక మొత్తం ధరలకు విక్రయించుకుంటూ లబ్ధి పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరులను ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం వేరుశెనగ పండించే రైతులకు ఉచితం గా పంపిణీ చేయడానికి సరఫరా చేసిన వేరుశనగ విత్తనాలను మొదట్లో ఒక్కొక్క రైతుకు పాసు పుస్తకం జిరాక్స్లు తీసుకొని స్థానిక వ్యవసాయ అధికారులు క్వింటాల్ వేరుశనగ విత్తనాలను సరఫరా చేసే వారిని, అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వేరుశెనగ విత్తనాల పంపిణీ లో జోక్యం చేసుకొని బినామీ రైతుల పేర ఎక్కువ మొత్తం వేరుశెనగ విత్తనాలను సరఫరా చేయించుకొని వాస్తవం గా వేరుశనగను పండించే రైతులకు ప్రస్తుతం 40 కిలోల విత్తనాలను సరఫరా చేస్తున్నారని కేతూరి నారాయణ విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితం గా పంపిణీ చేయడానికి మంజూరు చేసిన వేరుశనగ విత్తనాలను ఏ గ్రామం లోని రైతులకు ఎన్నెన్ని కిలోల విత్తనాలను మంజూరు చేశారో అట్టి రైతుల వివరాలను బహిరంగ పరచాలని ఆయన కొల్లాపూర్ లోని వ్యవసాయ శాఖ అధికారులను డిమాండ్ చేశారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితం గా పంపిణీ చేయడానికి సరఫరా చేస్తున్న వేరుసెనగ విత్తనాలను కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు, రత్నగిరి ఫౌండేషన్ సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు రత్నగిరి ఫౌండేషన్ ద్వారా వేరుసెనగ విత్తనాలను రైతులకు ఉచితం గా సరఫరా చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితము గా సరఫరా చేయడానికి మంజూరు చేసిన వేరుశెనగ విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు కాకుండా సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని మంత్రి అండదండలతో నడుస్తున్న రత్నగిరి ఫౌండేషన్ ద్వారా రైతులకు ఉచితం గా వేరుశనగ విత్తనాలు మంజూరు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నా సంబంధిత వ్యవసాయ అధికారులు ఏమాత్రం పట్టించు కోవడం లేదని కేతూరి నారాయణ విమర్శింస్తూ, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వేరుసెనగ విత్తనాల పంపిణీలో జరుగుతున్న అవకతవకల గురించి పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారుల గురించి జిల్లా కలెక్టర్ దుస్థితి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కేంద్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకు వెళుతున్నట్లు ఆయన తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉచితము గా పూర్తి సబ్సిడీ పద్ధతిలో సరఫరా చేస్తున్న వేరుశనగ విత్తనాలను అర్హులైన రైతులకే సక్రమం గా పంపిణీ చేయాలని, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో రైతుల పక్షాన నిలిచి అర్హులైన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితం గా సరఫరా చేస్తున్న వేరుశెనగ విత్తనాల పంపిణీ నీ బిజెపి పార్టీ చేపట్టవలసి వస్తుందని ఆయన వేరుశనగ విత్తనాల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులను, అలాగే వేరుశనగ విత్తనాలను తాము ఉచితం గా సరఫరా చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను రత్నగిరి ఫౌండేషన్ సభ్యులను కేతూరి నారాయణ హెచ్చరించారు.

ఈ సమావేశం లో కొల్లాపూర్ మండల బిజెపి పార్టీ మాజీ అధ్యక్షులు తమటం సాయి కృష్ణ గౌడ్, శేఖర్ రావు, ఒరే శేఖర్ , కురుమూర్తి , రమేష్ , భరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కాగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఉచితం గా సరఫరా చేస్తున్న వేరుసెనగ విత్తనాల పంపిణీలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అలాగే రత్నగిరి ఫౌండేషన్ సభ్యుల ప్రమేయం ప్రచారాల గురించి, బిజెపి నాయకులు చేస్తున్న ఆరోపణల గురించి కొల్లాపూర్ మండల వ్యవసాయ అధికారి ని వివరణ అడుగ గా వేరుసెనగ విత్తనాల పంపిణీ తమకు తెలియదని అసంపూర్తి సమాచారాన్ని కొల్లాపూర్ వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం గా “నేటి సత్యం” ప్రతినిధి యస్. పి . మల్లికార్జున సాగర్ కు సమాధానం ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments