Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 8:18 am Editor : Admin

చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి బి.ఎస్.పి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం *చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం – బీఎస్పీ*

బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బిఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబెర్ పృథ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్, జిల్లా కోశాధికారి దాస్ లు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పట్టణంలో ట్రాఫిక్ పేరుతో నిరుపేదలైన చిరు వ్యాపారులపై కక్ష పూరిత వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. రొట్టెలు కొట్టుకుని బ్రతికే వాళ్లపై, పండ్లు అమ్ముకుని బ్రతికే వాళ్లపై, పాన్ డబ్బాలు పెట్టుకుని బ్రతికే వాళ్లపై ప్రతి 15 రోజులకు ఒకసారి జేసీబీ తీసుకుని వెళ్లడం ఏంటనీ మండిపడ్డారు. అలా చేయమని ఏ రూల్ బుక్ లో ఉందని మండిపడ్డారు. పట్టణంలో చిన్న వర్షం వస్తే రోడ్లపై నీళ్లు మొత్తం ఆగుతున్నాయని, కొల్లాపూర్ చౌరస్తాలో వర్షానికి రోడ్లపై నీళ్లు ఆగుతున్నాయని, అట్లాగే శ్రీపురం రోడ్డు బీసీ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని రోజుల తరబడి ధర్నాలు చేశారని, హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే పట్టించుకోరనీ, మున్సిపాలిటీ నిధులు పక్కదారి పడితే పట్టించుకోరనీ, మున్సిపాలిటీ స్థలాల్లో తాజా – మాజీ రాజకీయ నాయకులకు చెందిన ఏళ్ల తరబడి లీజులు ఉంటే పట్టించుకోరనీ కానీ పొద్దున్న లేస్తే చిరు వ్యాపారుల మీద పడటం ఏంటని గర్హించారు. అసలు నిరుపేదల కూటిరాలపై దాడులు చేయమని ఎవరు చెప్తున్నారని ప్రశ్నించ్చారు. నాగర్ కర్నూల్ లో పని చేస్తున్న అధికారులు ప్రజల కోసం పని చేసేటట్టు అయితేనే ఆ కుర్చీల్లో కూర్చోవాలనీ అలా కాకుండా రాజకీయ నాయకుల కోసం పనిచేసేటట్టు ఐతే కండువాలు కప్పుకుని వారికీ నచ్చిన పార్టీల్లో జాయిన్ అవ్వాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు ఏ ఒక్కరికోసమే కాకుండా ప్రజలందరి కోసం పని చేయాలనీ డిమాండ్ చేశారు. అధికారులు కేవలం 2-3 సంవత్సరాలు పని చేసి ఇక్కడినుండి వెళ్ళిపోతారు ఈ సమయంలో పేదల మనస్సుల్లో స్థానం సంపాదించుకుని వెళ్లాలని, అలా కాకుండా పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే – ఈ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడిన, మాట్లాడకపోయినా నిరుపేదల తరపున బిఎస్పీ పార్టీ ఎల్లప్పుడూ మాట్లాడుతుందని, ప్రశ్నిస్తుందని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ పట్టణంలో ఉన్న చిరు వ్యాపారులకు న్యాయం జరిగే బిఎస్పీ పార్టీ పోరాడుతుందని తెలిపారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే చిరు వ్యాపారుల సమస్యపై స్పందించి మాట్లాడి, చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా కానీ పక్షంలో చిరు వ్యాపారులకు న్యాయం కోసం అవసరం ఐతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి హర్ష ముదిరాజ్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ అధ్యక్షులు మడుపు నాగేష్, నాయకులు పరుశరామ్, శంకర్, మధు, రాములు, శ్రీను, రాంచందర్, శ్రీరాములు, రమేష్, ప్రవీణ్, హర్ష, శివరాజ్, మధు, రాములు, బిఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు రాంచందర్, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.