Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 12:42 pm Editor : Admin

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నూతన జాతీయ విద్యా విధానం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 28 *విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న పాలకులు*

*రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నూతన జాతీయ విద్యావిధానం*

*రాష్ట్ర సర్కారు పెండింగ్ ఫీజులు చెల్లింపులు చెయ్యకపోతే విద్యార్ధుల చదువులు కొనసాగేదెలా?*

*విద్యార్థులకు శాపంగా మారిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు*

*ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు*

హైదరాబాద్ : ఏ సమాజానికైనా అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు ఇచ్చే సాధన విద్యాని, ఆ విద్యనే నేటి పాలకులు భ్రష్టుపట్టుస్తున్నారని, సమస్యల సుడిగుండంలో, సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని కాపాడలేని నిస్సహాయక స్థితిలో పాలక వర్గాలున్నాయని, రాష్ట్ర సర్కారు పెండింగ్ ఫీజులు చెల్లింపులు చెయ్యకపోతే విద్యార్ధుల చదువులు కొనసాగేదెలా అని, ప్రభుత్వ నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారాయని ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ విమర్శించారు. మంగళవారం హిమాయత్ నగర్ లోని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర సమితి సమావేశం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తూ భ్రష్టు పట్టుస్తున్నారని దుయ్యబట్టారు. విద్యారంగం సమస్యలను పరిష్కరించడంలో పాలక వర్గాలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం వారి పాలనలోనే అర్థం అవుతుందని అన్నారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను పూర్తిగా దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని దానిలో కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్య కార్పొరేటికరణ, విద్య కేంద్రీకరణ, కాషాయికరణ చేయాలని చూస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ నూతన విద్యా విధానాన్ని ఉపసహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ నూతన విద్యా విధానం రద్దుకై విద్యార్థులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరమైన భావి భారత పౌరుల చదువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని, రాజకీయ లబ్ధి కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న పాలకులు ప్రభుత్వ విద్యను పక్కకు పెడుతోందని మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రిని కూడా నియమించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియాంబర్స్ మెంట్ 8,300 కోట్ల రూపాయలు బకాయిల విడుదల విషయంలో, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులకు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు విడుదల పై ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి కూడా గ్యారంటీ లేకపోవడం విద్యారంగంపై ప్రభుత్వ పాధన్యతలేమీని తెలుపుతుందని అన్నారు. రాష్ట్ర సర్కారు పెండింగ్ ఫీజులు చెల్లింపులు చెయ్యకపోతే విద్యార్ధుల చదువులు కొనసాగేదెలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 03 నుండి నిరవధిక సమ్మె నోటీస్ ఇచ్చిన యాజమాన్య సంఘాలతో చర్చించి విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటికాల రామకృష్ణ, గ్యార నరేష్, రహమాన్, గ్యార క్రాంతి, సి. రాజు, రాష్ట్ర నాయకులు జేరిపోతుల జనార్ధన్, మచ్చ రమేష్, భాషబోయిన సంతోష్, నెల్లి సత్య, అక్రమ్, అజిత్, ప్రీతమ్, దిడ్డి పార్థసారథి, మూడవత్ పవన్, ప్రణీత్ గౌడ్, ప్రవీణ్, బి. ప్రేమ్ కుమార్, దినాకర్, అనిల్, హరీష్, దత్తు రెడ్డి,ప్రవీణ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.