Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 11:49 am Editor : Admin

తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయిన గొర్ల కాపరులు చనిపోయిన గొర్లు నష్టపరిహారం డి మాండ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 28. భారీగా నష్టపోయిన గొర్ల కాపర్ల కుటుంబాలను ఆదుకోవాలి

ప్రజాసంఘాల డిమాండ్ తాడూరు మండలం ఐతోలు, గోవిందాయిపల్లి,, బలాన్పల్లి గ్రామాలలో తుఫాన్ ముసురు వర్షం ఈదురు గాలుల వలన పెద్ద ఎత్తున గొర్రెలు చనిపోయాయని బాధిత కుటుంబాలను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) జిల్లా అధ్యక్షులు కొమ్ము భరత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వెంకటస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.

 

బుధవారం నాడు రాత్రి జరిగిన ఘటనలో గొర్రెలు చనిపోయిన కుటుంబాలను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా కొమ్ము భరత్ మాట్లాడుతూ మంగళవారం నాడు సాయంత్రం నుండి తుఫాన్ వర్షం కారణంగా తాండ్ర ముసలయ్య అనే గొర్రెల కాపరి గొర్రెలు 50 నుండి 60 దాకా మరణించాయి అలాగే అదే గ్రామానికి చెందిన బండారు రామచంద్రి 50 గొర్రెలు చనిపోయినవి ఒక్కొక్కరికి మూడున్నర లక్షల దాకా నష్టం వాటిల్లింది అలాగే గోవిందా పెళ్లి గ్రామంలో బొంకురి నారాయణ ఇరవై గొర్రెలు బొంకూరు బచ్చన్న 20 గొర్రెలు చనిపోయాయి గొట్టాల కాశన్న 35 గొర్రెలు చనిపోయినవి వారికి ఒక్కొక్కరికి రెండున్నర లక్షల దాకా నష్టం మరొకరికి మూడు నాలుగు లక్షల దాకా నష్టం వాటిల్లినది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గొర్రెలే జీవనాధారంగా బ్రతుకుతెరువుగా భావిస్తూ భూమిపైన బ్రతుకుతున్నటువంటి గొర్రెల కాపరులు అలాంటివారికి ఈ తుపాను కారణంగా భారీ నష్టం సంభవించినది అధికారులు పరామర్శించి కంటి తుడుపు చర్యలు చేపట్టడం కాకుండా తక్షణం ప్రభుత్వానికి నివేదికలు అందించి వారికి పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇల్లు ఇడుపు భార్యా పిల్లలను వదిలేసి నిత్యం జివాలను మేపుకోవటం కోసం శ్రీశైలం అడవులు నల్లమల అడవులు అన్ని తిరుగుతూ వచ్చి నాలుగు రోజులు అయ్యి ఊర్లో పత్తి చేతులను మేపుకుంటూ ఆ చేలలోనే మంద వేసుకొని ఉన్న సమయంలో నిన్న రాత్రి సంభవించినటువంటి అతి భారీ వర్షం వలన భారీ ఈదురుగాల వలన పెద్ద ఎత్తున గొర్రెలు మేకలు మరణించాయి భారీ నష్టం సంభవించే కుటుంబాలు ఘోషిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చొరవ తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా కుటుంబాలను ఆదుకునే విధంగా నివేదికలు పంపించి తక్షణం వా బాధిత కుటుంబాలను ఆదుకొని మానవత్వాన్ని చాటుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వెంకటస్వామి, గొల్ల రవి, బచ్చలు తిరుపతి, పోలేము నీ బాలయ్య, బాధితులు తాండ్ర ముసలయ్య, బండారు రామచంద్రి, బండారు మురళి, బొంకూరి నారాయణ, బొంకూరి బచ్చన్న, గొట్టాల కాశన్న, డి హెచ్ పి ఎస్ నాయకులు అభినవ్ తదితరులు పాల్గొన్నారు.