Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 1:27 pm Editor : Admin

మర్డర్ కేసును చేదించిన పోలీసులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మిస్టరీ మర్డర్ కేసు ను చేదించిన పోలీసులు.పోలీసులను ప్రశంసించిన ఎస్పీ ….కొల్లాపూర్, అక్టోబర్ 29 (నేటి సత్యం ప్రతినిధి:యస్.పి. మల్లికార్జున సాగర్)హత్య గావించ బడి గుర్తించ డానికి వీలు లేని స్థితి లో కాలి పోయి లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసు ను పోలీసులు త్వరగా చేదించి నిందితుని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచి న్యాయ మూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించిన సంఘటన ఇది.

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఎస్పీ కార్యాలయ ఆవరణ లో నిర్వహించిన మీడియా సమావేశం లో మహిళ హత్య మిస్టరీ నీ చేదించిన సంఘటన వివరాలను తెలియజేశారు.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గము పెంట్లవెల్లి మండలం లోని మంచాల కట్ట గ్రామ సమీపం లోని సాకలి రాముని గుట్ట పై గుర్తు తెలియని మహిళ కాలిన శవం గుర్తు పట్టలేని స్థితి లో పడి ఉన్న విషయాన్ని గురించి మంచాల కట్ట గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పెంట్లవెల్లి మండల పోలీస్ ఎస్ఐ రామన్ గౌడ్ కేసు ను నమోదు చేసుకొని కొల్లాపూర్ పోలీస్ సిఐ కే. మహేష్, కొల్లాపూర్ పోలీస్ ఎస్ఐ రిషికేష్ , నాగర్ కర్నూల్ డి.ఎస్.పి బుర్రి శ్రీనివాసులు ఆధ్వర్యం లో దర్యాప్తును చేపట్టారని ఎస్పీ తెలియజేశారు.

హత్య జరిగిన సంఘటన స్థలం లో హత్య గావింప బడి పూర్తిగా కాలి పోయి గుర్తు పట్ట లేని స్థితి లో ఉన్న మహిళ మృతదేహం పై లభించిన ఆధారాలను వెండి ఇతర ఆభరణాల తో పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజీలతో సాంకేతిక పరిజ్ఞానం తో పోలీసులు చేపట్టిన దర్యాప్తు చేపట్టారు అని ఎస్పీ తెలియజేశారు.

పోలీస్ లో దర్యాప్తు కు తోడు హతురాలి తల్లిదండ్రులు 27- 10- 2025 న తమ కూతురు అదృశ్యమైనట్లు చేసిన ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మహిళ మృతదేహం దగ్గర లభించిన ఆభరణాలను చూయించ గా అది తమ కూతురివే అని నిర్ధారించు కున్నట్లు ఎస్పీ తెలియజేశారు.

దీనితో లభించిన సాక్షాదారాల మేరకు సాంకేతిక పరిజ్ఞానం తో నిందితుడు బోయ విజయ్ కుమార్ ను (23)ను అదుపు లోకి తీసుకొని విచారించినట్లు ఎస్పి తెలియజేశారు.

కొల్లాపూర్ పట్టణం లోని ఇందిరా కాలనీ లో నివాసం ఉండే కొమ్మరి (బోయ ) స్వర్ణలత (32) వివాహమై భర్త తో విడాకులు తీసుకుని టైలర్ పని చేసుకుంటూ జీవిస్తూ ఉండేదని ఆయన తెలియజేశారు.

అదే కాలనీలో నివాసం ఉండే బోయ విజయకుమార్ (23) స్వర్ణలత తో సన్నిహితం గా ఉoడడం , వివాహేతర సంబంధం తో కలిసి మెలిసి కొనసాగుతూ ఉండేవారని తెలియజేశారు.

ఈ క్రమం లో విజయ్ కుమార్ వేరొక అమ్మాయి తో వివాహము చేసుకొనుటకు ప్రయత్నాలు కొనసాగిస్తుండడం తో ఈ విషయం లో స్వర్ణలత విజయ కుమార్ రెండు మూడు పర్యాయాలు గొడవ పడినారని, కొత్త గా వేరే అమ్మాయిని పెండ్లి చేసుకోవద్దని నన్నే పెళ్లి చేసుకోవాలని లేదంటే తాను విజయకుమార్ కలిసి దిగి ఉన్న ఫోటోలను విజయకుమార్ తల్లిదండ్రులకు తెలియజేస్తానని స్వర్ణలత రెండు మూడు పర్యాయాలు విజయకుమార్ ను హెచ్చరిస్తూ గొడవపడినట్లు ఎస్పీ తెలియజేశారు.

ఆ తర్వాత 8-10-2025 న ఉదయం 7-30 నిమిషాలకు స్వర్ణలత విజయ్ కుమార్ పనిచేసే బజాజ్ మోటార్ సైకిల్ షోరూం దగ్గరికి వెళ్లి నీతో మాట్లాడాలి రమ్మని విజయ కుమార్ కు ఫోన్ చేయ గా స్వర్ణలత నుండి తనకు ఎప్పుడైనా ముప్పు ఉంటుందని భావించి ఆమెను అడ్డు తొలగించు కోవడానికి ఆమె ను ఎలాగైనా హత్య చేయాలనే ఉద్దేశం లో ఉన్న విజయ కుమార్ ఇదే అదను గా చేసుకొని అక్కడ మాట్లాడడం కుదరదు అని , నీవు కొల్లాపూర్ లో బస్సు ఎక్కి పెంట్ల వెల్లి కి రా అక్కడ మాట్లాడు కుందామని స్వర్ణలత ను కొల్లాపూర్ నుండి పెంట్ల వెల్లి కి విజయకుమార్ బస్సులో రప్పించుకున్నారని ఎస్పీ తెలియజేశారు.

కొల్లాపూర్ నుండి పెంట్ల వెల్లి కి బస్సులో వచ్చిన స్వర్ణ లత ను విజయకుమార్ తన పల్సర్ బైక్ టిజి 31- 9165 పై ఎక్కించు కొని మంచాలకట్ట గ్రామం లోని కృష్ణానది తీరం లో ఉన్న పుష్కర ఘాటు దగ్గర కు తీసుకువెళ్లాడు అని అక్కడ కొద్దిసేపు స్వర్ణలత విజయ్ కుమార్ గొడవ పడి ఇక్కడ ఎవరైనా చూస్తారు ఎవరు లేని ప్రదేశం నకు పోదామంటూ అక్కడి నుండి సమీపం లో ఎవరు లేని సాకలి రాముడు గుట్ట ప్రాంతానికి స్వర్ణ లత ను తీసుకు వెళ్లిన విజయ్ కుమార్ అక్కడ స్వర్ణలత తో మరొక సారి గొడవ పడి ఆమె ను తన కుడి మోచేతి తో గొంతు నులిమి హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలియజేశారు.

ఆ తరువాత తాను హత్య చేసిన స్వర్ణలత హత్య ఉదంతము బయటకు రాకూడదని, స్వర్ణలత శవము ను ఎవరు గుర్తు పట్ట కూడదు అనే ఉద్దేశం తో స్వర్ణలత ను హత్య చేసిన విజయ్ కుమార్ హత్య సంఘటన స్థలము నుండి తన పల్సర్ బైక్ పై మంచాలకట్ట గ్రామం లోకి వచ్చి రెండు లీటర్ల పెట్రోల్ ను, ఒక అగ్గిపెట్టె ను, సిగ రేట్ ను అక్కడి దుకాణం లో కొనుక్కొని తిరిగి స్వర్ణలత ను హత్య చేసిన సంఘటన స్థలానికి వచ్చి తాను కొని తీసుకు వచ్చిన పెట్రోల్ ను తాను హత్య చేసిన స్వర్ణలత మృత దేహం పై పోసి తాను తెచ్చిన అగ్గి పెట్టే ను వెలిగించి స్వర్ణలత మృత దేహము ను కాల్చివేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తమ విచారణ లో నిందితుడు నేరస్థుడు విజయ్ కుమార్ ఒప్పు కుంటు స్వర్ణ లత ను హత్య చేసిన విధానం ను పోలీసులకు తెలియజేశారని ఎస్పీ తెలియజేశారు.

దీనితో స్వర్ణలతను హత్య చేసి కాల్చివేసిన నిందితుడు నేరస్థుడు విజయ్ కుమార్ (23)ను

న్యాయ స్థానం లో హాజరు పరచ గా న్యాయమూర్తి ఆదేశాల మేరకు విజయ్ కుమార్ ను రిమాండ్ కు తరలించినట్లు ఎస్పి తెలియజేశారు.

కాగా హత్య చేసి గుర్తు తెలియని స్థితి లో కాల్చివేయబడి ఉన్న మహిళ శవ సంఘటనను కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం లోని పెంట్లవెల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామన్ గౌడ్ కేసు నమోదు చేసుకొని కొల్లాపూర్ సిఐ మహేష్ , ఎస్సై రిషికేష్ ఆధ్వర్యం లో నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాసులు పర్యవేక్షణ లో లభించిన సాక్షాదారాల ఆధారం గా సాంకేతిక ఆధారాల మేరకు గుర్తు తెలియని మహిళ హత్య మిస్టరీని చాలెంజి గా తీసుకొని త్వర గా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడు నేరస్తుడు విజయ్ కుమార్ ను అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచిన పోలీస్ అధికారులను సిబ్బందిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రత్యేకం గా అభినందిస్తూ ప్రశంసించారు.