(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సి ఈ ఐ ఆర్ టెక్నాలజీతో పోగొట్టుకున్న ఫోన్ అప్పగించిన —గన్నేరువరం ఎస్సై జి నరేందర్ రెడ్డి
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 29 (రమేష్ రిపోర్టర్):-
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పోలీస్ స్టేషన్ లో
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ సి ఈ ఐ ఆర్ టెక్నాలజీతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితునికి అప్పగించిన గన్నేరువరం ఎస్ఐ జి.నరేందర్ రెడ్డి , పిసి సాయి ప్రేమ్ గత కొన్ని రోజుల క్రితం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ఆసరి పర్షరాములు s/o లింగయ్య అనే వ్యక్తి గన్నేరువరం మండలంలో తమ ఫోన్ పోగొట్టుకున్నాడని పిర్యాదు చేయగా గన్నేరువరం పోలీస్ కానిస్టేబుల్ పి. సాయిప్రేమ్ ఆ పిర్యాదుని స్వీకరించి www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ల యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి, బ్లాక్ చేసారు. ఆ ఫోన్లో ఈ వెబ్సైట్ ద్వారా దొరికిన వ్యక్తి వివరాలతో కూడిన సమాచారం గన్నేరువరం పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్ దొరికిన వ్యక్తి నుండి ఫోన్ స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయడం జరిగిందని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి పోలీసు వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు.