Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 2:14 pm Editor : Admin

మా గ్రామాన్ని కాపాడండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జలదిగ్బంధం లో ముక్కిడి గుండం గ్రామం..

పట్టించుకోని పాలకులు ప్రజాప్రతినిధులు..

కొల్లాపూర్, అక్టోబర్ 29 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లికార్జున సాగర్)

కొల్లాపూర్ మండల పరిధి లోని ముక్కిడి గుండం గ్రామం గత అనేక ఏండ్లు గా జలదిగ్బంధం లో కొట్టుమిట్టాడుతున్న పాలకులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారు అని సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కమిటీ సభ్యులు బాల పీరు విమర్శించారు.

కొల్లాపూర్ మండలము ముక్కుడిగుండ గ్రామ సమీపంలోని పెద్ద వాగు దగ్గర బుధవారం ఆయన గ్రామస్తులతో కలిసి వాగులను సందర్శించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామం నలుమూలల్లో వాగులు వంకలు ఏరులై పారుతూ ఆ గ్రామానికి రాక పోకలని పూర్తిగా స్తంభించి గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నా అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం లేదని ఇది అత్యంత సిగ్గుచేటు విషయమని ఆయన విమర్శించారు .

ఎన్నికల ముందు ప్రజా ప్రతినిధులు అధికారులు రాజకీయ పార్టీల నాయకులు ముక్కిడి గుండం గ్రామానికి అనేక హామీలు వాగ్దానాలు చేయడం తప్ప , ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రజా పతినిధులు ప్రభుత్వ అధికారులు వాటిని అమలు చేయకుండా విస్మరించడం పాలకులకు, ప్రజా ప్రతినిధులకు నిత్య కృతమైందనీ ఆయన విమర్శించారు.

నార్లాపూర్ ముక్కిడిగుండం పెద్దవాగు బ్రిడ్జి ఎత్తు పెంచకుండా నాసిరకమైనటి పనులతో నిర్మించిన వంతెన నేడు అకాల వర్షానికి దరి కూలి, బిడ్జి కూలిపోయే ప్రమాదం లో ఉన్నదని ఆయన అన్నారు.

అనేక ఏండ్లుగా ముక్కుడిగుండం గ్రామ ప్రజలు పెద్దవాగు పొంగిపొర్లుతుండడం వలన ప్రజలు ఇబ్బందులు పడతున్నా కొల్లాపూర్ శాసనసభ్యులు, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని బాల పీరు ముక్కిడి గుండం గ్రామ ప్రజలు అధికారుల ప్రజాప్రతినిధుల మంత్రి నిర్లక్ష్యాలను విమర్శించారు.

ప్రత్యేక శ్రద్ధతో వాగుల పైన బ్రిడ్జిలను పూర్తిస్థాయిలో నిర్మించి ముక్కుడి గుండం ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించాలని వారు సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

వర్షాలు వచ్చినప్పుడు వారం రోజులపాటు ముక్కిడి గుండం గ్రామానికి రాకపోకలు బంద్ అవుతున్నాయి అని , అనారోగ్యాల పాలై గ్రామస్తులు, చదువులు కు విద్యార్థులు వెళ్లలేని స్థితిలో ఇబ్బంది పడతా ఉన్నారు అని ,వ్యవసాయానికి రైతులు ఎల్లలేకపోతున్నారు గొర్ల కాపర్లు తమ యొక్క గొర్రెలను దగ్గరకి వెళ్లలేక జలదిగ్బంధమైన ముక్కుడిగుండం గ్రామంలోనే అడవి ప్రాంతంలో జంతువుల వలె బిక్కుబిక్కు అని బతుకు ఎల్లదీస్తున్నారని వారన్నారు.

జల దిగ్బంధమైన ముక్కుడిగుండం గ్రామం బయట ఉన్న జనం బయటనే ఉంటున్నారు ఊర్లో ఉన్న ప్రజలు ఊరు దాటే పరిస్థితి లేకుండా ఉంది, ఈన్నేళ్ల స్వతంత్ర కాలం లో కూడా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంటే నేడు పాలకులు పట్టించు కోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరించడం సరికాదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ముక్కుడిగుండం గ్రామ సమీపం లో ఉన్న పెద్ద వాగు బ్రిడ్జిని ముందున్నా చిన్న బ్రిడ్జిని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి మల చింతల పల్లి కి వెళ్లే రహదారిలో ఉండే బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు నిర్మించాలనీ ,జిల్దార్ తిప్పా చెరువుకు వెళ్లే రహదారిలో పశువుల డొంక పైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమం లో పాతావత్ మోడీ నాయక్, బాలు నాయక్ , నాగ మల్లయ్య , ఆడే హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.