గన్నేరువరం మండలంలో మొంతా తుఫాన్ ప్రభావంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 30 (రమేష్ రిపోర్టర్)
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలoలో నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గన్నేరువరం చెరువు భారీగా వాలు పారడంతో అలాగే పారువేల్ల నుండి గన్నవరం మార్గమధ్యలో ఉన్న లో లెవెల్ వంతెన నుండి భారీగా నీరు వెళ్లడంతో పారువెళ్ల గ్రామస్తులు మండల కేంద్రానికి రాలేని పరిస్థితి నెలకొంది అలాగే చొక్కా రావు పల్లి గ్రామస్తులు గన్నేరువరం చెరువు మత్తడి పారడంతో మండలానికి రాలేని విధంగా వాలు పోయడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. మండల కేంద్రానికి పలు గ్రామాల నుండి రాకపోకలు నిలిచాయి గన్నేరువరం మండల ఎస్సై జి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే గన్నేరువరం చెరువు వద్ద భారీకెట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి నరేందర్ రెడ్డి,హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి, కానిస్టేబుల్ అంజయ్య పాల్గొన్నారు.