కొల్లాపూర్, అక్టోబర్ 30.(యస్.పి.మల్లిఖార్జున సాగర్) కొల్లాపూర్. అసెంబ్లీ నియోజకవర్గం రామాపురం గ్రామంలో పశువుల వాగుపై బ్రిడ్జి నిర్మాణము చేయకపోవడం మూలంగా గ్రామస్తులు రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు పెట్టబడుతున్నారని రామాపురం గ్రామ నివాసి సామాజిక సేవా నాయకులు ఆకున మౌని చంద్రయ్య యాదవ్ విమర్శించారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నకు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు పశువుల వాగు పై బ్రిడ్జి నిర్మాణమునకు ఏమాత్రం కృషి చేయడం లేదని రామాపురం గ్రామస్తులు రైతులు ఆకున మౌని చంద్రయాలు విమర్శించారు.
పశువుల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఆకునుముని చంద్రయ్య యాదవ్ గురువారం రోజు పశువుల వాగు పై పారుతున్న నీటిలో బయటాయించి జల దీక్షను చేపట్టారు.
ఇప్పటికైనా కొల్లాపూర్ శాసనసభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకొని పశువుల వాగు పై బ్రిడ్జి నిర్మాణమునకు కృషి చేయాలని చంద్రయ్య యాదవ్ గ్రామ ప్రజలు రైతులు డిమాండ్ చేశారు.