Neti Satyam
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 8:39 am Editor : Admin

కార్మిక హక్కులకై పోరాటాలకు సిద్ధం కండి రామస్వామి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం చేవెళ్ల అక్టోబర్ 31*కార్మికులందరూ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలి**చేవెళ్లలో ఘనంగా ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

*ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి*

ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని భూపారాట కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు కె రామస్వామి హాజరై ఏఐటియుసి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31 వ తేదీన భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని తెలిపారు భారతదేశంలో ఆ రోజుల్లో కంపెనీలలో 10 గంటల పని గంటల విధానం అమలులో ఉండేది అని బాంబేలో నూలు పరిశ్రమలో వేలాదిమంది కార్మికులు చాలీచాలని జీతాలతో అధిక పనిగంటలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్న తరుణంలో 1917 వ సంవత్సరంలో రష్యాలో జరిగిన విప్లవము భారతదేశంలో దాని ప్రభావం పడింది రష్యా విప్లవ స్ఫూర్తితో భారతదేశంలో కార్మికులు రైతులు కర్షకులు సంఘటితమై ఒక కార్మిక సంఘంగా ఏర్పడాలి అని లాలా లజపతిరాయ్ అధ్యక్షతన 1920 అక్టోబర్ 31 వ తేదీన ముంబైలో ఏఐటియుసి కార్మిక సంఘం ఏర్పడిందని ఒకపక్క స్వాతంత్ర పోరాటంలో కార్మిక వర్గం పాలుపంచుకుంటూ కార్మిక హక్కులకు సాధనకై పోరాటం చేస్తూ స్వాతంత్రం రాక పూర్వమే 44 రకాల కార్మిక చట్టాలను సాధించడం జరిగిందని ఎనిమిది గంటల పని విధానము సాధించడం జరిగిందని పేర్కొన్నారు దేశంలో 106 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కార్మిక సంఘం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఏఐటియుసి అని కొనియాడారు కానీ ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులపై దాడి చేయడం మొదలు పెట్టినాడని కార్పొరేట్ శక్తులకు పెట్టుబడుదారి శక్తులకు కొమ్ము కాస్తూ 44 రకాల చట్టాలను నాలుగు కోడులుగా చేసి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేశాడని పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను తొలగించి వాటి స్థానంలో 12 గంటల పని దినాలను తీసుకువచ్చాడని భవిష్యత్తులో కార్మిక వర్గం తగిన బుద్ధి మోడీ ప్రభుత్వానికి చెబుతుందని తెలిపారు కార్మికులకు ఈఎస్ఐ పీఎఫ్ బోనస్ గ్రాటివిటీ మొదలగు సౌకర్యాలను యాజమాన్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం అంతా సంఘటితం కావలసిన ఆవశ్యకత ఏర్పడిందని భవిష్యత్తు పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రభు లింగం ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్ ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సభ్యురాలు వడ్ల మంజుల బికేఎంయు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి శంకర్పల్లి మండల పార్టీ కార్యదర్శి సుధీర్ ఏఐటీయూసీ నాయకులు శౌరీలు బాబు పెంటయ్య సత్తయ్య సుధాకర్ గౌడ్ నరసయ్య అంజమ్మ వెంకటమ్మ హసన్ శ్రీను షాబాదు నర్సింలు జయమ్మ స్వరూప నరసింహులు తదితరులు పాల్గొన్నారు