ఏఐటియుసి 106వ ఆవిర్భావ వేడుకలను శంషాబాద్ లో నిర్వహించిన నాయకులు
నేటి సత్యం శంషాబాద్ అక్టోబర్ 31ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు
ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ 106 సంవత్సరాల కింద 1920 అక్టోబర్ 31న భారతదేశంలో ఏఐటియుసి ఆవిర్భవించింది అని పర్వతాలు తెలిపారు
ఆనాటి నుండి కార్మికులకు అండగా కష్టజీవులకు అండగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా దోపిడిదారులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నదని పర్వతాలు తెలిపారు
పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు పెంచాలని సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని అనేక సంవత్సరాలుగా ఏఐటియుసి నిరంతరం పోరాడుతూనే ఉందని ఆయన అన్నారు
ఏఐటియుసి సంఘంలో కార్మికులు చేరి తమ కోరికల సాధన కోసం పోరాటాలు నిర్వహించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నెపు ప్రభు అధ్యక్షత వహించి మాట్లాడారు
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి జిలకరాజు అధ్యక్షుడు నరేష్ కార్మికులు పాల్గొన్నారు