నేటి సత్యం గండిపేట్ మండల్ అక్టోబర్ 31
ఏఐటి యూసి 106 వ ఆవిర్భావ వేడుకలు గండిపేట్ మండల్ మణికొండ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా పాల్గొన్నఏఐటి యూసి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఏఐటి యూసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్ మల్లేష్ సీనియర్ నాయకులు ఎం శంకరయ్య ఈ సందర్భంగా ఎస్ మల్లేష్ మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31 న భారత దేశంలో ఏఐటి యూసి ఆవిర్భవించింది ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికులకు అండగా కష్టజీవులకు అండగా దోపిడీదారులకు వ్యతిరేకంగా కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడుతుందని ఎస్ మల్లేష్ తెలిపారు పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని సంఘ టిత అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని.4 లేబర్ కోడ్ లను రద్దుచేసి44 కార్మిక చట్టాలను పునరుద్దించాలని కనీస వేతనాలు రూ 26.000/-లు నిర్ధారించి అమలు చేయాలని కాంట్రాక్ట్ ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల నుపర్మినెంట్ చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తింపి కొట్టాలని అన్నారు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నవారు ఎం బాబురావు బి ఓ సి మండల కార్యదర్శి శ్రీకాంత్ ఏఐటి యూసి నాయకులు ప్రకాష్ శ్రీరాము ప్రభు లక్ష్మి మా దేవి చిన్న రాము లక్ష్మణ్ రమేష్ నాయకులు పాల్గొనడం జరిగింది