(adsbygoogle = window.adsbygoogle || []).push({});
_*యువతిని ప్రేమించిన మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి డ్రైవర్*_
_*తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయడంతో మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య*_
_*నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీశైలం(సూరి) అనే యువకుడిని ప్రేమించిన శ్రీలత(21) అనే యువతి*_
ప్రేమ వివాహం 3 నెలల క్రితం యువతి ఇంట్లో తెలియడంతో, వారు పెళ్లి కుదరదు అనడంతో అప్పుడే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీలత
తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా, తనకు శ్రీలతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పిన ప్రియుడు శ్రీశైలం
మూడు రోజుల క్రితం శ్రీలతకు వేరే యువకుడితో వివాహం జరిపించిన తల్లిదండ్రులు
ప్రియుడు మోసం చేశాడని పెళ్లయిన మూడు రోజులకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన శ్రీలత
సూరి మోసం చేసినందుకే శ్రీలత చనిపోయిందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, అది తమ పరిధిలోకి రాదని ఫిర్యాదు స్వీకరించని కోస్గి పోలీసులు
అధికార కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి అండతోనే పోలీసులు సూరిపై కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తున్న శ్రీలత తల్లిదండ్రులు