Neti Satyam
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 10:42 am Editor : Admin

మంత్రిగా అజరుద్దీన్ నియమకం పై హర్షం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం *మంత్రిగా అజారుద్దీన్ నియామకంపై హర్షం*

*షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్*

*మైనార్టీలకు రాజకీయంగా చేయూతనిచ్చిన ప్రభుత్వం*

తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్ లో మైనార్టీలకు ప్రాధాన్యత లేదని రాజకీయంగా మైనార్టీలను అణిచివేస్తున్నారని గతంలో విమర్శించిన ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజహారుద్దీన్ ను క్యాబినెట్ లోకి మంత్రిగా తీసుకోవడం శుభసూచకమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ కొనియాడారు. శుక్రవారం మొహమ్మద్ అజాహరోద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. గతంలో మైనార్టీలకు ప్రభుత్వంలో చేయూత అందించలేదని రాజకీయంగా మైనార్టీల పక్షాన ఉన్నట్లు ప్రతిపక్షాలు ఒక దంపుడు ప్రకటన చేసే వారని ఇప్పుడు ఆజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. కానీ మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తే ప్రతిపక్షాలకు కడుపు ఉబ్బుతోందని విమర్శించారు. మైనార్టీల సంక్షేమం కోసం అజారుద్దీన్ కృషి చేయాలని ఈ సందర్భంగా బాబర్ కోరారు. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం లో తగిన ప్రాధాన్యత కల్పించినందుకు ముస్లిం సమాజం తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర మంత్రులకు ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు మేడం..