(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కురుమూర్తి జాతరకి రండి తెలంగాణ సభాపతికి దేవరకద్ర ఎంఎల్ఏ జీఎంఆర్ ఆహ్వానం
నేటి సత్యం హైదరాబాద్ నవంబర్ 1
తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతన ఆలయం పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెంది దేవరకద్ర నియోజకవర్గం లో కొలువైనా కురుమూర్తి స్వామి జాతర ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రత్యేకం. స్వామి వారి అలంకరణ, ఉద్దాలు ప్రఖ్యాతి గాంచిన ఈ జాతరకు రావాలని సభాపతి కలిసి ఆహ్వానించారు దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా జీఎంఆర్ మాట్లాడుతూ గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం 110 కోట్లతో శంకుస్థాపన చేయగా, ఈ ఏడాది ప్రత్యేక అతిధిగా తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, సామెల్ కార్తీక్ పాల్గొన్నారు.