(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించండి*
– సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి *ఈటి నరసింహ* నేటి సత్యం జూబ్లీహిల్స్ నవంబర్ 2
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో *సిపిఐ* బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని *సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి నరసింహా గారు* అన్నారు.
తేది: 02 /11/2025 ఆదివారం నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డి గూడ డివిజన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఈటి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రజలను,ప్రజల అవసరాలను పట్టించుకోకపోగా పార్టీ నాయకులు ఒంటెద్దు పోకడలతో రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ పాలన కొనసాగించారని,పదేళ్ల కాలంలో విద్యావ్యవస్థ, వైద్యం, ఉపాధిని పట్టించుకోకుండా అధికార వ్యామోహంతో నిరంకుశంగా వ్యవహరించారని అన్నారు. మరో పక్క భారతీయ జనతా పార్టీ యువత మరియు ప్రజల ఉపాధి కల్పన గురించి ఏమాత్రం మాట్లాడకుండా, విభిన్న మతాలు కలిసి ఉండే సున్నితమైన హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారానే పార్టీ బలపడాలని చూస్తుందని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీని నిలుపుకోలేకపోవడంలో, పునర్విభజన తర్వాత తెలంగాణకు రావలసిన నిధులను కేటాయించలో విఫలమైందని అన్నారు. నియంతృత్వ కుటుంబ పాలన గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా విద్యా కమిషన్ ఏర్పాటుచేసిందని, అదేవిధంగా రాష్ట్రంలో ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసిందని, అదేవిధంగా పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండేందుకు నూతన ప్రదేశంలో ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణంకై ముందడుగు వేసిందని, రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని,నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట నూతన గృహాలు కట్టించి సమగ్రమైన అభివృద్ధికి పట్టం కడుతుందని అన్నారు. ప్రచారంలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు వి ఎస్ బోస్ ,హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపల్లి శ్రీనివాస్ మరియు నేర్లకంటి శ్రీకాంత్, బాలకృష్ణ, నరసింహ, అడ్వకేట్ నాగేష్ ,లెనిన్,యాదిలాల్, భీముడు, ఉదయ్ కుమార్, అశ్వన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.