Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 1:45 pm Editor : Admin

బాల్య వివాహం అడ్డుకున్న కార్యదర్శి పై..ఆశా కార్యకర్త దాడి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బాల్య వివాహం అడ్డుకున్న కార్యదర్శి పై ఆశా కార్యకర్త దాడి

వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం లో వెలుగు చూసిన వైనం

ఆశా కార్యకర్తపై కేసు నమోదు

నేటి సత్యం మహబూబునగర్ ప్రతినిధి/ నవంబర్ 2

శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి కంప్యూటర్ యుగంలో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుపుతూ బాల్యంలో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జిల్లాలో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ ఎప్పటికప్పుడు బాల్య వివాహాల పైన ఆయన ఉక్కు పాదం మోపిన కూడా చివరకు పోలీసుల కండ్లు కప్పి వనపర్తి జిల్లా పరిధిలోని జిల్లా ఖిల్లా గణపురం మండలం వెంకటాపురం గ్రామంలో బాల్యవివాహాన్ని అడ్డుకున్న ఆ గ్రామ కార్యదర్శి రామకృష్ణ పై ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి తన బిడ్డ కూతురు వివాహాన్ని అడ్డుకున్నారని నెపంతో కక్షతో ఆ గ్రామ కార్యదర్శి రామకృష్ణ పై దాడి చేసిన సంఘటనపై ఖిల్లా గణపురం పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక ఉద్యోగంలో ఉంటూ ప్రజలను చైతన్యం చేయవలసిన గర్భిణీ స్త్రీలను బాలింతలను శిశు మరణాలను అరికట్టవలసిన బాధ్యతగల ఆశా వర్కర్ భాగ్యలక్ష్మి ఆమె కూతురు వివాహం బాల్య దశలో చేస్తున్న విషయాన్ని అప్పటికే వనపర్తి జిల్లా ఐసిడిఎస్ అధికారులు సమాచారం తెలుసుకొని బాల్య వివాహాన్ని అడ్డుకొని తల్లితండ్రులకు కౌన్సిలింగ్ అవగాహన కల్పించారు. ఈ అక్కస్సుతో తన బిడ్డ వివాహం అడ్డుకోవడంలో ఆ గ్రామ కార్యదర్శి రామకృష్ణ ప్రధాన పాత్ర పోషించాడని నెపంతో రామకృష్ణ పై దాడి చేసిందని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ విషయం పైన పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వెంటనే గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలతో పాటు గర్భిణీ స్త్రీలు బాలింతలు శిశు మరణాలు. బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యంగా పల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పవలసిన బాధ్యతగల ఆశా కార్యకర్త భాగ్యలక్ష్మి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ సంఘటన పైన జిల్లా కలెక్టర్ సీరియస్ గా ఆమెను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తో పాటు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఈ మధ్యకాలంలో వనపర్తి జిల్లాలో జరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టాలని శక్తి వంచన లేకుండా కృషి చేసిన కూడా సమాజంలో విద్యావంతులు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ముఖ్యంగా ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఇలాంటి ఆశా కార్యకర్తలు బాల్య వివాహాలను ప్రోత్సహిస్తూ తమ బిడ్డలను పెళ్లి చేయాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల పైన కఠినమైన శిక్షలు విధించాలని జిల్లా ప్రజలు జిల్లా ఎస్పీని కోరుతున్నారు. ఈ విషయం పైన జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.