(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో “జూపల్లి”పాత్ర కీలకం
కొల్లాపూర్ నియోజక వర్గ ప్రజలు జూపల్లి వెనుక
కొల్లాపూర్ లో ఎన్నికల్లో వనపర్తి కొల్లాపూర్ ఓటర్లు ఆయన గుప్పిట్లో
ఎమ్మెల్యేగా మంత్రిగా చరిత్ర సృష్టించిన మంత్రి రాజకీయంలో దిట్టా
నేటి సత్యం మహబూబునగర్ ప్రతినిధి/ నవంబర్ 1
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్పు తెచ్చే ఎన్నికలలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ఒకటిగా ఈ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏకచిత్రాధిపత్యం వహిస్తూ పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు అనేక ఆర్థిక సమస్యలు ఆర్థిక సంక్షోభం గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. నా గొంతు కోసిన ఒక్క రూపాయి కూడా ఖజానాల్లో లేదని గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ చెల్లిస్తూ లోటు బడ్జెట్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ సంతకం చేసిన విషయాన్ని ప్రజలకు వెల్లడించారు. అయినప్పటికీ ఆనాటి నుంచి నేటి వరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోయినా కూడా ప్రభుత్వాన్ని కుటుంబాన్ని గడిపినట్టు ఉన్న డబ్బులతో సంసారం చేస్తూ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మరోపక్క టిఆర్ఎస్ పార్టీకి బిజెపి పార్టీకి ఒక సవాల్ గా రెఫరెంట్ గా మారింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి భవితం ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక మలుపు తిరుగుతుందని భావించిన అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు శాసనసభ్యులు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను ఒక సవాలుగా తీసుకొని 24 గంటలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ మధ్య బలమైన పోటీ ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం ఎంతోమంది రాష్ట్రంలోని మంత్రులు శాసనసభ్యులు జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నప్పటికీ అందులో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ జిల్లాలోని రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన రాజకీయాల్లో ఒక పేరు పొందిన కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు ఈ ఎన్నికలను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జూపల్లి కృష్ణారావు ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన కొల్లాపూర్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2004 ఎన్నికలలో పొత్తు లో భాగంగా తమకు సీటు రాకపోయినా స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జూపల్లి గెలుపొందారు. ఆ తర్వాత 2009లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రోశయ్య ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆ తర్వాత అప్పటి మాజీ ముఖ్యమంత్రి నల్ల కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు తమ మంత్రి పదవికి రాజీనామా చేసి 2011 అక్టోబర్ 30 న టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పూర్తిచేసి ఆయన గెలుపొందారు. తిరిగి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలో జూపల్లి కృష్ణారావు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొల్లాపూర్ నుంచి పోటీచేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆయన ఓటమి చవి చూశారు. ఆ తర్వాత జరిగిన 2023 డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొల్లాపూర్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొంది రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం ఎక్సైజ్ పర్యటక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వయిస్తూ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో పేరు పొందిన జూపల్లి కృష్ణారావు ప్రస్తుతం 2024 సంవత్సరంలో నాగర్కర్నూల్ లోక్ సభ ఇన్చార్జిగా డిసెంబర్ 24న నిజాంబాద్ ఇన్చార్జి మంత్రిగా. 2025 జూన్ 12న ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా పనిచేస్తూ ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన కీలకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన కృషి వెలకట్టలేనిది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎర్రగడ్డ, రహిమత్ నగర్, బోరబండ, అమీర్పేట్, మోతి నగర్, డివిజన్ లో అత్యధిక జనాభా కలిగిన కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఓటర్లు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉపాధి కోసం కొంతమంది స్థానికంగా నివసిస్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల ఓటర్లు దాదాపు 80 వేల మంది నుంచి లక్షలు మంది దాకా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన ప్రజలను ఓటర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే తమ గుపిట్లో పెట్టుకుని తన సత్తా చాటుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆరుసార్లు కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గెలవడానికి ప్రధాన కారణం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రజలు హైదరాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, తదితర ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తున్న విషయం గమనిస్తూ ప్రతిసారి జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటర్లను మంత్రి జూపల్లి రాజకీయ తెలివితేటలతో వలస వెళ్లిన ఓటర్లను ఎన్నికలలో తరలించకపోవడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ కొల్లాపూర్ నుంచి అనేకసార్లు గెలుపొందిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా కొల్లాపూర్ నియోజక వర్గ ఓటర్లను ఆయన ప్రతిరోజు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కష్టపడుతూ కొల్లాపూర్ ఓటర్లను ప్రభావితం చేయడం ప్రజలకు దగ్గర కావడం గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గానికి వలస ఓటర్లను తరలించడంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సక్సెస్ అయ్యారు. అదే కోణంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఆయన తన ప్రతాపాన్ని తన రాజకీయ శక్తి యుక్తిని చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం భారీ మెజార్టీ కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు పనిచేస్తున్నట్లు అక్కడ నివాసం ఉంటున్న కొల్లాపూర్ ప్రాంత ఓటర్లు ప్రజా ప్రతిభ దినపత్రిక ప్రతినిధి అందించిన సమాచారం మేరకు మీకు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాం. మొత్తమ్మీద రాష్ట్ర రాజకీయాలలోని ఒక బలమైన రాజకీయ నాయకుడిగా మంత్రిగా జూపల్లి కృష్ణారావుకు ఎంతో పేరు ఉన్న సంగతి అందరికీ తెలుసు అలాంటి బలమైన మంత్రి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో కొల్లాపూర్ ఓటర్లను ఆయన గుప్పిట్లో పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టిఆర్ఎస్ పార్టీ మధ్య బలమైన పోటీ ఉన్నట్లు ఆ ప్రాంతంలోనివసిస్తున్న కొల్లాపూర్ ప్రాంత ఓటర్ల నాడి సమాచారం ప్రకారం తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ఈ మధ్యకాలంలో బిజెపి హైదరాబాద్ నగరంలో పుంజుకున్నప్పటికీ మోడీ చరిష్మా ఏమేరా పని చేస్తుందో ఎవ్వరికి అంతుచిక్కని పరిస్థితి బిజెపి జాతీయస్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న అతిపెద్ద జాతీయ పార్టీ మూడుసార్లు ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పరాజయం అయితే బిజెపి పరిస్థితి తెలంగాణలో అంతే సంగతులు అని వదంతులు కూడా వినిపిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు బిజెపి ఇవ్వడం లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు బలంగా వినిపిస్తూ ముందుకు సాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో జూబ్లీహిల్స్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ జీవితాలను మార్చే దిశగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పక సందేశం లేదు.