నేటి సత్యం శేర్లింగంపల్లి నవంబర్ 2 దమ్ముంటే రండి, చర్చకు సిద్ధం’
భూముల వివాదంపై ఎమ్మెల్యే గాంధీ సంచలన సవాల్
శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూముల కబ్జాలపై హైడ్రా (HYDRA) చేపడుతున్న కూల్చివేతలను తాను స్వాగతిస్తున్నానని, అయితే ప్రైవేటు భూములపై దాడులు, రాళ్లు కొట్టడం ఎంతవరకు సమంజసమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ శాసనసభ్యులను, మాజీ స్పీకర్‌ను, మాజీ మంత్రిని నిలదీశారు. తన భూముల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇస్తూనే, ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
’11 ఎకరాలు వాస్తవం: 1991 నుంచే మా సొంతం’
తనపై కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణల్లోని ముఖ్య అంశమైన 11 ఎకరాల కొనుగోలుపై గాంధీ స్పష్టత ఇచ్చారు. “నేను రాజకీయాల్లోకి వచ్చాక ఎటువంటి భూములు కొనలేదు. ఆ 11 ఎకరాలు కొన్న మాట వాస్తవమే, కానీ అది నేను ఒక్కడినే కొన్నది కాదు. మేము తొమ్మిది మంది కుటుంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్ శోభనాద్రి, నిజామాబాద్ సభ్యులు కలిసి అరకరం, అరకరం చొప్పున 1991లోనే కొనుగోలు చేశాం” అని వివరించారు.
నిర్దిష్ట ఆధారాలు:
1991 నాటి పైసల్ పట్టీ, పహానీ, రిజిస్టర్ డాక్యుమెంట్లు, మోటివేషన్, నక్ష వంటి అన్ని లింక్ డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
కోర్టు తీర్పు:
2008లోనే కొందరు తమ భూమి SFCదని కోర్టుకు వెళ్లగా, రెవెన్యూ అధికారులు హైకోర్టుకు తమది ‘ప్రైవేటు భూమి’ అని అఫిడవిట్ సమర్పించారని, 2010లో తీర్పు కూడా వచ్చిందని ఆయన వెల్లడించారు.
అబద్ధపు ఆరోపణలు, కేటీఆర్ ప్రస్తావన
కొంతమంది తెలిసి తెలియక కొద్దిమంది అమాయకులను తప్పుదారి పట్టించి, ఒకటికి పదిసార్లు అబద్ధాలు చెప్పడం మూలంగా దానిని నిజమని నమ్మిస్తున్నారు. 11 ఎకరాల గాంధీ అని కొందరు శాసనసభ్యులు ఓర్వలేక కేటీఆర్‌కు చెప్పడం మూలంగా ఆయన కూడా అదే మాట్లాడడం జరిగింది. అది తప్పు” అని గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ, 2014, 2018, 2024 ఎన్నికల సమయంలో కూడా తాను ఈ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో దాఖలు చేశానన్నారు. “వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే అభినందిస్తాం, స్వాగతిస్తాం” అని పేర్కొన్నారు.
నీ సంపద ఎట్లా వచ్చింది? 1000 కోట్లకు ఎలా ఎదిగావు?’
తనపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేను ఉద్దేశిస్తూ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. “జగద్గిరిగుట్ట నుంచి స్లిప్పర్స్ వేసుకుని మీసాల వీరప్పన్ మాదిరిగా నడిచిన నువ్వు, ఈరోజు 1000 కోట్లకు పైగా ఎలా ఎదిగావు? ఏ వ్యాపారం చేసి ఆ సంపద సంపాదించావో చెప్పాలి” అని నిలదీశారు.
భారీ ఆరోపణలు: ఐడీపీఎల్ ల్యాండ్‌ను కబ్జా చేసి సంపాదించారా? 166/6 సర్వే నెంబర్లో ఎకరం ఎక్కువ కలుపుకుని స్కూలు కట్టుకోవడం వాస్తవం కాదా?
పన్నుల ఎగవేత:
ప్రభుత్వం 30 లక్షల టాక్స్ విధించగా, కేవలం 7 లక్షలు మాత్రమే కడుతూ ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్‌ను ఎగ్గొట్టలేదా? అని ప్రశ్నించారు.
రాజకీయ సవాల్:* ‘సీబీఐ విచారణకు రెడీ, నీకు దమ్ముందా?’
“నా విషయంలో ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు నా మీద బురద జల్లడం సమంజసమా?” అని ప్రశ్నించిన గాంధీ, బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
“మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. మీడియా సమక్షంలో బహిరంగంగా మీకు తెలిసిన వారిని తీసుకొని రండి. చర్చకు పెడదాం.” అన్ని డాక్యుమెంట్లతో తాను ఎక్కడికి రమ్మన్నా వచ్చి ప్రదర్శనకు పెడతానని ఛాలెంజ్ చేశారు.
*నిఘా సంస్థల విచారణకు డిమాండ్:* “2014 నుండి 2024 దాకా ఏ శాసనసభ్యుడు ఎంత అక్రమాస్తులు సంపాదించాడో సీబీఐ, ఈడీ, హోంమినిస్టర్‌కు, మోదీకి దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు రెడీగా ఉన్నావా? నీకు దమ్ముందా?” అని పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఆగ్రహంగా ఛాలెంజ్ విసిరారు.
పేదల పొట్ట కొట్టడానికి కారకులు ఎవరు?
హైడ్రా చర్యలు బాగున్నా, పేద ప్రజల పొట్ట కొట్టడాన్ని తాను ఖండిస్తున్నానన్న గాంధీ, దీనికి కారకులు ఎవరు అని ప్రశ్నించారు. “ఆ పేద ప్రజలకు భూములు ఎవరమ్మారు? ఆ పేద ప్రజలను మోసం చేసింది ఎవరు? పెద్దాయన (మాజీ స్పీకర్), మంత్రిగా పనిచేసిన వారు నిజాయితీగా ఆలోచించి మోసం చేసిన వారిని వదిలిపెట్టి, ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదు” అని హితవు పలికారు.
*త్వరలో సంచలనం:* కూకట్పల్లి సర్వే నెంబర్ 90, ఐడీపీఎల్ భూములు, బోరంపేట, బాచుపల్లి ప్రాంతాలలో జరిగిన కబ్జాల బాగోతాన్ని అన్ని ఆధారాలతో త్వరలో ప్రెస్ క్లబ్లో బట్టబయలు చేస్తానని గాంధీ హెచ్చరించారు.
#AdminPost #ArekapudiGandhi #PACChairman #MLASerilingampally