(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం చేవెళ్ల నవంబర్ 3 *బస్సు ప్రమాదంలో మరణించిన వారికి 50 లక్షలు ఎక్స్గ్రేషియో ఇవ్వాలి*గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి మెరుగైన వైద్యం అందించాలి*
*మృతుల కుటుంబంలోని ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి**హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు పనులను ఆలస్యం కావడంవల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి*
*సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి మిర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు టిప్పర్ జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు బస్సు ప్రమాదంలో మరణించిన వారికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మృతుల కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి అని వారికి మెరుగైన వైద్య సౌకర్యము చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పైన గతంలో కూడా చాలా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఎంతోమంది చనిపోయారని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఎన్ని ప్రమాదాలు జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు తప్ప ప్రమాదాలు నివారించడానికి మాత్రం ఎలాంటి మౌలిక చర్యలు తీసుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని ప్రజలు ప్రభుత్వానికి రోడ్డ టాక్స్ లు కట్టాలి ప్రాణాలు పోగొట్టుకోవాలి ప్రభుత్వానికి మాత్రం ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయిందని వాపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఏ రామస్వామి ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రబులింగం ఇన్షాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు