(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం చేవెళ్లే నవంబర్ 3 *”చేవెళ్ల మీర్జాగూడ బస్సు రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరం. మృతుల కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలి సిపిఐ రామకృష్ణ ..*
*క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి*
*వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..*
*సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులుసిపిఐ*
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద టిప్పర్. బస్సు రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధాకరమని సిపిఐ రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు పేర్కొన్నారు. బస్సు ప్రయాణికులపై టిప్పర్ లో ఉన్న కంకర పడిపోవడంతో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన తీవ్ర విషాద ఘటన కలిచివేసిందని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని. ప్రమాదంలో గాయపడిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని.. ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.