(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం నాగర్ కర్నూల్ నవంబర్ 3 *ప్రైవేటు ఆసుపత్రుల దోపిడి అరికట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా*
*సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ*
*సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్*
భారత కమ్యూనిస్టు పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో డి ఎం హెచ్ ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు ప్రజలు రోగాల బారిన పడి ప్రభుత్వాసుపత్రిలకు వస్తే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది మందులు లేవని టెస్టులు, స్కానింగులు బయటి ప్రైవేట్ ల్యాబ్ లకు రెఫర్ చేస్తూ రోగులను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ప్రభుత్వాసుపత్రిలో సరైన వసతులు లేక స్పెషలిస్ట్ డాక్టర్లు లేక ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వంటి పేర్లు పెట్టి రోగుల నుంచి టెస్టులు స్కానింగ్ ల పేరిట వేలకు వేలుగా ఫీజులు వారి ఇష్టానుసారంగా వసూలు చేస్తూ ప్రజల యొక్క అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఆసుపత్రులు వ్యాపార నిలయాలుగా జిల్లా కేంద్రంలో మారాయని ఇలాంటి పరిస్థితిని వెంటనే చక్కదిద్ది ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన వైద్యాన్ని సిబ్బందిని నియమించి ప్రజలను ఆదుకోవాలని అదేవిధంగా ప్రైవేటు ఆసుపత్రుల యొక్క దోపిడీని అరికట్టడానికి జిల్లా యంత్రాంగం ప్రైవేటు ఆస్పత్రులను సందర్శించి వారు టెస్టులు స్కానింగ్ ల పేరుట వసూలు చేస్తున్నటువంటి దోపిడిని అరికట్టాలని ప్రభుత్వా నిబంధనలకు అనుగుణంగా డాక్టర్ ఫీజు టెస్టులు స్కానింగ్ ఫీజులను ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా చూడాలని అదేవిధంగా కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ పర్మిషన్ ఒకరి పేరు మీద అక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టరు ఎంబిబిఎస్ అర్హత లేకుండా ఆర్ఎంపి డాక్టర్లే వైద్యులుగా చలామణి అవుతున్నారా ఇలాంటి వాటిని డీఎంహెచ్వో గారు తక్షణమే ప్రైవేటు హాస్పిటల్స్ తనిఖీ చేసి నివారించాలని వారి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ధర్నా అనంతరం పలు డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఏవో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు తన్నీరు నరసింహ, విజయుడు, యేసయ్య, జిల్లా సమితి సభ్యులు కృష్ణాజి,బోల్లెద్దుల శ్రీనివాస్, రవీందర్, తుమ్మల శివుడు, బండి లక్ష్మీపతి, శివశంకర్, మల్లయ్య, కిరణ్ కుమార్, దేశమోని అంజి,ప్రేమ్ కుమార్, గోపాల్, కురుమయ్య, శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.