కార్తీక పురాణం..13 వ అధ్యాయం
నేటి సత్యం నవంబర్ 3 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *కార్తీక పురాణం* ➖➖➖✍️ 13 వ అధ్యాయము కన్యాదాన ఫలం:``` “ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము.. కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈవిధముగా ఒక పేద...