Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 3:34 am Editor : Admin

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

* నేటి సత్యం. శేరిలింగంపల్లి* మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలి.. కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నెహ్రూనగర్ బస్తీ దావఖానలో జన శిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటిషన్ శిక్షణ కోర్స్ ఇన్స్టిట్యూట్ ను శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జన శిక్షణల ద్వారా ఉపాధి మార్గాలను ఎంచుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కార్పొరేటర్ గారు సూచించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. జన శిక్షణ సంస్థాన్‌ ఆధ్వర్యంలో బ్యూటిషన్‌ శిక్షణ నేర్చుకునే మహిళలకు తన వంతు సహకారం ఎల్లపుడు అందిస్తానని హామీ ఇచ్చారు.

బస్తీ దవఖానాలోని పై ఫ్లోర్ లో బ్యూటిషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు వెసులుబాటు కల్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారికి జన శిక్షణ సంస్థాన్ వారు శిక్షణ పొందే మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ రాంమోహన్ రెడ్డి, ప్రోగ్రామ్ అసోసియేట్ స్వప్న రెడ్డి, వహీద్, టీచర్ ఇర్ఫాన, తన్వీర్ బేగం, మహేందర్ సింగ్, జగదీశ్, సర్వేష్ కుమార్, షబాజ్, సంపత్, జన శిక్షణా సంస్థాన్‌ సిబ్బంది, శిక్షకులు, శిక్షణార్దులు తదితరులు పాల్గొన్నారు.